భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవ జరుగుతుందా? (Video)

దాంపత్య దోషాలు తొలగిపోవాలంటే కాత్యాయని మంత్రాన్ని పఠించాలని పురాణాలు చెప్తున్నాయి. వివాహం కాని కన్యలు, వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వారు కాత్యాయని మంత్రాన్ని 45 రోజుల పాటు నిష్ఠతో పఠి

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (11:14 IST)
దాంపత్య దోషాలు తొలగిపోవాలంటే కాత్యాయని మంత్రాన్ని పఠించాలని పురాణాలు చెప్తున్నాయి. వివాహం కాని కన్యలు, వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వారు కాత్యాయని మంత్రాన్ని 45 రోజుల పాటు నిష్ఠతో పఠించిన వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. దాంపత్యం పండుతుంది.


దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. కాత్యాయని మంత్రాన్ని పఠించిన వారికి సకల భోగభాగ్యాలు చేకూరుతాయి. వివాహ అడ్డంకులను తొలగించేందుకు కాత్యాయని మంత్ర పఠనం చేయాలని భాగవతం చెప్తోంది. 
 
కాత్యాయని దేవి నిష్ఠతో పూజించి విష్ణువును భర్తగా పొందింది. అందుకే ఆ అమ్మవారినికి పూజించిన వారికి మాంగల్య దోషాలు తొలగిపోతాయి. నవదుర్గల్లో కాత్యాయని మాతకు ఆరో స్థానం. ఈమెకు గురు గ్రహం ఆధిపత్య దైవం. ఈమె సింహంపై ఆసీనురాలై వుంటుంది. త్రినేత్రాలను కలిగివుంటుంది. కాత్యాయని మంత్ర జపంతో కుజ దోషాలు హరించుకుపోతాయి. దాంపత్య జీవనంలో వుండే దోషాలను ఇది తొలగిస్తుంది. కాత్యాయని మంత్రాన్ని జపించే దంపతులు అన్యోన్యంగా జీవనం సాగిస్తారు. అలాగే సంతానం లేని దంపతులకు కాత్యాయని మంత్ర జపంతో వంశాభివృద్ధి చేకూరుతుంది. 
 
''కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్ యతీశ్వరి 
నంద గోప సుతం దేవీ పతిమే కురుతే నమః 
అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః
కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కందర 
విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం 
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే 
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే 
శరణ్యే త్రయంబికే దేవీ నారాయణే నమోస్తుతే" 41 రోజులు అమ్మవారిని ఈ మంత్రంతో జపిస్తే దాంపత్య దోష నివారణ జరుగుతుంది. భార్యాభర్తల మధ్య విడాకులు అనే మాటకు చోటుండదు. ఇంకా దంపతుల మధ్య వివాదాలుండవని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

Cyclone Montha: 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు

కరూర్‌ బాధితులను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ - దర్యాప్తు చేపట్టిన సీబీఐ

నత్తలా నడుచుకుంటూ వస్తున్న మొంథా తుఫాను, రేపు రాత్రికి కాకినాడకు...

పెరగనున్న ఏపీ జిల్లాల సంఖ్య.. ఆ రెండు జిల్లాల భాగాలను విలీనం చేస్తారా?

అన్నీ చూడండి

లేటెస్ట్

26-10-2025 నుంచి 02-11-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

karthika somavaram కార్తీక సోమవారం ఈశ్వరుణ్ణి పూజిస్తే సత్వరమే ప్రసన్నం

25-10-2025 శనివారం దినఫలాలు - గ్రహాల సంచారం అనుకూలం

పంచమి రోజున వారాహి పూజ... ఏ రాశుల వారు ఆమెను పూజించాలి.. తెలుపు బీన్స్?

2026 పూరీ జగన్నాథుని రథయాత్రతో ప్రారంభం.. సేంద్రియ బియ్యంతో మహా ప్రసాదం

తర్వాతి కథనం
Show comments