Webdunia - Bharat's app for daily news and videos

Install App

24-12-2018 సోమవారం దినఫలాలు - సహోద్యోగుల నిర్లక్ష్యం వల్ల..

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (08:44 IST)
మేషం: నిత్యావసర వస్తు స్టాకిస్టులు, రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. విద్యార్థినులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి. భాగస్వామిక చర్లచు, మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. వృత్తుల, ఏజెంట్లు, బ్రోకర్లకు సామాన్యం. 
 
వృషభం: ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి, పనిభారం అధికం. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మిధునం: నిర్మాణ పనుల్లో పనివారల తీరు ఆందోళన కలిగిస్తుంది. ధనవ్యయంలో ఏకాగ్రత చాలా అవసరం. మీ వాహనం ఇతరులకిచ్చే విషంయలో లౌక్యంగా వ్యవహరించండి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సహోద్యోగుల నిర్లక్ష్యం వలన అధికారులతో మాటపడవలసివస్తుంది. సోదరులతో ఏకీభవించలేక పోతారు.  
 
కర్కాటకం: ప్లీడర్లు కోర్టు వాదోపవాదాల్లో రాణిస్తారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దైవ, సేవా, పుణ్య కార్యాలకు ఇతోధికంగా సహాయం అందిస్తారు. మీ గౌరవ, అభిమానాలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. ప్రేమికుల మధ్య అవగాహన లోపం, స్పర్ధలు తలెత్తుతాయి.   
 
సింహం: స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. యోగ, ఆరోగ్య విషయాల్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇంటాబయటా మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. 
 
కన్య: విదేశీ పర్యటన ఏర్పాట్లు ముమ్మరం కాగలవు. కొత్త పనులు చేపట్టుకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. దైవ, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. శ్రీవారు, శ్రీమతిల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి.   
 
తుల: ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబైల్ రంగాలవారికి సదవకాశాలు లభిస్తాయి. విజ్ఞతగా వ్యవహరించిన ఒక సమస్యను పరిష్కరిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మీరు తలపెట్టిన పనులలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్పురిస్తుంది. 
 
వృశ్చికం: ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. మీపై శకునాలు, చెప్పుడు మాటల ప్రభావం అధికం. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి.  
 
ధనస్సు: ఆర్థిక విషయాల్లో ముందుచూపు అవసరమని గమనించండి. ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. క్రీడా రంగాలవారికి ప్రోత్సాహనం లభిస్తుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు.  
 
మకరం: స్త్రీలకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ చాలా అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిత్రుల మాటతీరు, పద్ధతి కష్టం కలిగిస్తాయి. నిరుద్యోగులకు బోగక్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. విద్యార్థుల్లో మందకొడితనం, ఏకాగ్రత లోపం వంటి చికాకులు చోటు చేసుకుంటాయి.     
 
కుంభం: రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రం సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులు బంధువుల కారణంగా అర్ధాంతంగా ముగించాల్సి వస్తుంది.   
 
మీనం: వృత్తి, వ్యాపార, వ్యవహారాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహానం కలిగిస్తాయి. పత్రికా సిబ్బందికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. రాబడికి మించిన ఖర్చులెదురైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

తర్వాతి కథనం
Show comments