Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

19-12-2018 బుధవారం దినఫలాలు - స్త్రీలు అపరిచిత వ్యక్తులతో...

Advertiesment
19-12-2018 బుధవారం దినఫలాలు - స్త్రీలు అపరిచిత వ్యక్తులతో...
, బుధవారం, 19 డిశెంబరు 2018 (08:15 IST)
మేషం: కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడుతాయి. సోదరీసోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. విద్యార్థుల అతి ఉత్సాహనం అనార్థాలకు దారితీస్తుంది. దైవా, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్కొంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకులు అధికం. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. 
 
వృషభం: ఆహార వ్యవహారాలలో మెళకువ వహించండి. ప్రభుత్వ కార్యక్రమాలలోని పనులు సానుకూలమవుతాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మీ శ్రీమతితో అనునయంగా మెలగాలి. రాజకీయనాయకులకు దూరప్రయాణాలలో మెళకువ అవసరం. ఫీజులు చెల్లిస్తారు.  
 
మిధునం: సంఘంలో పలుకుబడి గల వ్యక్తుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఇతరుల ఆంతరంగిక విషయాలలో తలదూర్చకండి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.  
 
కర్కాటకం: కుటుంబ సమస్యల నుండి బయటపడుతారు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. ఏదైనా వస్తువు కొనుగోలుకు షాపింగ్ చేస్తారు. దైవ దర్శనాల వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమ అధికమవుతాయి.  
 
సింహం: బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ధనం ఏ మాత్రం పొదుపు చేయాలన్న ఆర్థిక ఇబ్బంది అంటూ ఏది ఉండదు. ప్రేమికులు పెద్దలతో ఏకీభవించలేకపోతారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. స్త్రీలు అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషించండి.  
 
కన్య: స్త్రీ మూలకంగా వివాదాలు ఎదుర్కుంటారు. యాదృచ్చికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఉద్యోగస్తులు అధికారులతో సమస్యలను ఎదుర్కుంటారు. దా, ధర్మాలు చేసి మంచి గుర్తింపు పొందుతారు. మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.   
 
తుల: ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. రాజకీయ నాయకులు కీలక పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. అపార్ధాలు మాని ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ సంతానం కదలికలను గమనిస్తుండాలి. స్త్రీలు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖుల సిఫార్సులతో పనులు సానుకూలమవుతాయి.  
 
వృశ్చికం: స్త్రీలకు నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. కోర్టు వ్యవహారాలు అనుకున్నంత సాఫీగా సాగవు. రాజకీయనాయకులకు ప్రయాణాలలోనూ, ఆహార వ్యవహారాలలో మెళకువ వహించండి. ఒకనాటి మీ కష్టానికి నేడు ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ ప్రకటనలపై అవగాహన ముఖ్యం.  
 
ధనస్సు: స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత, మెళకువ చాలా అవసరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన లేఖలు అందుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి. మిత్రుల కలయికతో మానసిక ప్రశాంతత పొందుతారు.  
 
మకరం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధువులరాకతో ఆదాయానికి తగినట్టుగా ఖర్చులుంటాయి. చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. దూరప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.     
 
కుంభం: ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ప్రయత్నపూర్వకంగా మొండి బాకీలు వసూలుకాగలవు.   
 
మీనం: భాగస్వామిక సమావేశాలు ప్రశాంతంగా సాగుతాయి. సోదరీసోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయంచేస్తారు. ఇతరులకు వాహనం ఇవ్వడం వలన సమస్యలు తలెత్తుతాయి. ఎటువంటి స్వార్ధచింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముక్కోటి ఏకాదశి రోజున జాగరణ ఎప్పుడు.. ఎలా చేయాలి?