Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21-12-2018 శుక్రవారం దినఫలాలు - ఓర్పు, నేర్పు, అంకిత భావంతో..

Advertiesment
21-12-2018 శుక్రవారం దినఫలాలు - ఓర్పు, నేర్పు, అంకిత భావంతో..
, శుక్రవారం, 21 డిశెంబరు 2018 (08:32 IST)
మేషం: స్త్రీలు ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల సూచనలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. శుభాకాంక్షలు అందుకుంటారు.
 
వృషభం: చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. అయిన వారు మీ నుండి ధనసహాయం ఆశిస్తారు. సంఘంలో పలుకుబడి కల వ్యక్తుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు ఏమంత సంతృప్తికరంగా సాగవు. స్త్రీలకు అయిన వారి నుండి ఆహ్వానాలు అందుతాయి.  
 
మిధునం: వస్త్ర వ్యాపారులను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. నూతన వ్యక్తుల పరిచయం వలన కొత్త అనుభూతికి లోనవుతారు. ఖర్చులు అధికమవుతాయి. ఆలయ సందర్శనాల కోసం దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. రాజకీయ, సాంఘిక, సాంస్కతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు.
 
కర్కాటకం: కాంట్రాక్టర్లకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఓర్పు, నేర్పు, అంకిత భావంతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు. బంధుమిత్రులను ఇంటికి ఆహ్వానిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు పనివారల వలన నష్టపోవలసి వస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.   
 
సింహం: వృత్తిపరమైన ఆటంకాలు తొలగుతాయి. ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యాలు సమస్యలకు దారితీస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఇతరుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. సాంఘిక, సాంస్కృతిక, సినిమా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కన్య: వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. తొందరపాటుతనం వలన ఇబ్బందుల్లో పడే ఆస్కారం ఉంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. వాహనం ఏకాగ్రతతో నడపాలి. బంధువులతో కలిసి వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. 
 
తుల: ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. మీ రాక బంధువులకు సంతోషం కలిగిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలుచేస్తారు. మీ పలుకుబడి, వ్యవహార దక్షతతో అనుకున్నది సాధిస్తారు.  
 
వృశ్చికం: రావలసిన ధనం కొంతముందు వెనుకలుగానైనా అందటం వలన ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. సంతానం విద్యా విషయాలు, కళత్ర ఆరోగ్యంలో ఆందోళన తప్పదు. మిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. ఒక నష్టాన్ని మరో విధంగా పూడ్చుకుంటారు. ప్రముఖులను మీ ఇంటికి విందుకు ఆహ్వానిస్తారు. 
 
ధనస్సు: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. రాజకీయ నాయకులు సభలు, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉపాధ్యాయులకు ఇతర వ్యాపకాలు విడనాడి విధినిర్వహణలో ఏకాగ్రతతో వ్యవహరించవలసి ఉంటుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
మకరం: వైద్యులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. విలాసాలకు ధనం బాగుగా వ్యయం చేస్తారు. వారసత్వపు వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో కలిగి వేడుకలలో పాల్గొంటారు. భాగస్వామ్యుల మధ్య పరస్పర అవగాహన అభివృద్ధి కానవస్తుంది. నూతన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. 
 
కుంభం: మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడుతాయి. రావలసిన ధనం సకాలంలో అందుకుంటారు. దూరప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. బంధువులతో పట్టింపులు, చికాకులు ఎదుర్కుంటారు. విద్యార్థులు భయాందోళనలు విడనాడి శ్రమించిన తమ లక్ష్యం సాధించగలరు.   
 
మీనం: మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు సామాన్యం. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన భంగపాటుకు గురవుతారు. కుటుంబీకుల కోసం బాగా వ్యయం చేస్తారు. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే దిశగా మీ ఆలోచనలుంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకడిని బలవంతుడిగా మరొకడిని అధముడిగా చేసేది అదే... స్వామి వివేకనంద