Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచమి: వరాహి దేవి పూజ.. ఎరుపు వత్తులు.. నవధాన్యాల గారెలను..?

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (05:00 IST)
Godess Varahi
పంచమి తిథిలో వరాహి దేవిని పూజిస్తే సమస్త దోషాలుండవు. పౌర్ణమి, అమావాస్య ముగిసిన ఐదో రోజున వరాహి దేవిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ తిథి మహత్తరమైనది. సప్తకన్యల్లో వరాహి దేవి ఒకరు. 
 
మనం చేసే కార్యాలు దిగ్విజయం కావాలంటే.. కార్యసిద్ధి కోసం వరాహి దేవిని పూజించడం ఉత్తమం. అదీ పంచమి తిథిలో వరాహి దేవి స్తుతితో అనుకున్న కోరికలు తీరుతాయి. ఆ రోజున వ్రతమాచరించి పూజిస్తే.. రుణబాధలుండవు. ఆర్థిక సమస్యలుండవు. వయోబేధం లేకుండా పంచమి తిథి రోజున వరాహి దేవి కోసం వ్రతమాచరించవచ్చు.
 
అయితే పంచమి తిథిలో జన్మించిన వారికి ఈ తిథిన వరాహి దేవి పూజ ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఇంకా పంచమి తిథిలో జన్మించిన జాతకులు పుట్టకు పాలు పోయడం.. వరాహి దేవిని పూజించడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. 
 
ఇంకా ఐదు నూనెలను కలగలిపి.. ఆమెకు దీపం వెలిగిస్తే సకలసంపదలు వెల్లివిరుస్తాయి. ఈ దీపానికి ఎరుపు వత్తులను వాడటం మంచిది. నైవేద్యంగా పొట్టు తీయని మినపప్పుతో తయారు చేసిన గారెలు లేకుంటే నవధాన్యాలతో చేసిన గారెలను, పెరుగన్నం, శెనగలు, పానకం వంటివి సమర్పించవచ్చు.  
 
ఇంకా "ఓం శ్రీ పంచమి దేవియే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. ఇంట సుభిక్షానికి కొదవవుండదు. రుణబాధలుండవు. దారద్ర్యం తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...

తర్వాతి కథనం
Show comments