Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీవ సమాధులను ఏ రోజు దర్శించుకోవాలి.. అదీ సోమవారం..?

Advertiesment
Siddha Jeeva Samadhi
, ఆదివారం, 1 నవంబరు 2020 (05:00 IST)
సిద్ధులు, యోగులు జీవ సమాధి అవుతారని వినే వుంటాం. అయితే అలాంటి జీవ సమాధులు వెలసిన క్షేత్రాలను పూజించడం చేయవచ్చా..? జీవ సమాధులను దర్శించుకోవడం.. పూజించడం ద్వారా ఎలాంటి ఫలితాలుంటాయి..? ఇంకా జీవ సమాధులను ఏ సమయంలో పూజించాలని తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవండి.
 
న్యాయమైన, నీతి నిజాయితీతో కోరిన కోర్కెలు.. సోమవారం ఉదయం ఏడు గంటల్లోపు లేదంటే సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల్లోపు దర్శించుకోవాలి. ఇలా ఎనిమిది సోమవారాలు దర్శించుకోవడం, పూజించడం చేయాలి.
 
కులదైవం ఏమిటో తెలియనివారు, కులదైవ కోపానికి గురైనవారు, కులదైవ పూజ చేయని వారు, కులదైవాన్ని శుభ్రం మరిచిపోయిన వారు.. ఇలాంటి చర్యలతో ఇబ్బందులు, ఈతిబాధలు ఎదుర్కొనే వారు.. మంగళవారాల్లో సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల్లో జీవ సమాధులను దర్శించుకుని నేతి దీపం వెలిగించి.. అగరవత్తులు ధూపమేయాలి. ఇలా ఎనిమిది వారాలు జీవ సమాధులను దర్శించుకోవడం మంచిది.
 
వ్యాపారాల్లో అభివృద్ధి పొందాలనుకునేవారు.. ఉద్యోగాల్లో రాణించాలనుకునేవారు, ఆర్థికాభివృద్ధి పొందాలనుకునేవారు.. జీవ సమాధులను దర్శించుకోవడం మంచిది. ఇలాంటి వారు బుధవారాల్లో సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల్లోపు దర్శించుకోవాలి. ఇలా ఎనిమిది వారాలు చేయాలి.
 
అలాగే గురువారాల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచేందుకు జీవ సమాధులు ఉపయోగపడతాయి. ఉద్యోగ రీత్యా ఇబ్బందులు తొలగిపోవాలంటే.. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలనుకునేవారు.. శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల్లోపు జీవ సమాధిని దర్శించుకోవడం మంచిది. ఇలా ఎనిమిది శుక్రవారాలు చేయాలి.
 
అలాగే శనివారాల్లో జీవ సమాధులను దర్శించుకుంటే.. కుటుంబ సమస్యలు, వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కోర్టు వివాదాలు, న్యాయస్థానాల సమస్యలు తొలగిపోవాలంటే.. ఆదివారం జీవ సమాధులను దర్శించుకోవడం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఆదివారం సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల్లోపు దర్శించుకోవాలి.
 
ఇంకా జీవసమాధులను దర్శించుకునేవారు ఎవరైనా.. ఆ రోజున మాంసాహారం తీసుకోవడం నిషిద్ధం. ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతంలోని ఏదైనా జీవ సమాధిని దర్శించుకోవడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి. 
 
ఇంకా ఎనిమిది వారాల పాటు జీవ సమాధులను దర్శించుకుంటేనే సకలసుఖ సంతోషాలను పొందవచ్చు. కానీ ఎనిమిది వారాలు జీవ సమాధులను వరుసగా దర్శించుకున్నాక.. నెలకోసారి మూడు నెలలకు ఓసారి మాత్రమే దర్శించుకుంటే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-11-2020 నుంచి 30-11-2020 వరకు మీ మాస రాశి ఫలాలు