Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ రాఘవేంద్ర స్వామికి 7 గురువారాలు ఇలా చేస్తే.. పట్టిందల్లా బంగారమే..?! (video)

Advertiesment
worship
, గురువారం, 1 అక్టోబరు 2020 (05:00 IST)
Raghavendra
గురువారం రాఘవేంద్ర స్వామికి ప్రాశస్త్యమైనది. రాఘవేంద్ర స్వామి బృందావనంలోకి ప్రవేశించింది ఈ రోజునే.  మూడు శతాబ్దాల క్రితం రాఘవేంద్ర స్వామి 1671లో మంత్రాలయలో బృందావనంలోకి ప్రవేశించింది.. గురువారం నాడే. మైసూరులోని మంత్రాలయంలో గురువారం నాడు రాఘవేంద్ర స్వామి పూజలు ఘనంగా జరుగుతాయి. ఆ తర్వాత బృందావనంలో జీవ సమాధి అయిన శ్రీ రాఘవేంద్రునికి కూడా పూజలు ఘనంగా నిర్వహిస్తారు. 
 
గురువారం పూట రాఘవేంద్రునికి చేసే పూజలు సకల సంపదలను ఇస్తాయి. గురువారం పూట ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకుని.. పూజగదిని రంగ వల్లికలు, పువ్వులతో అలంకరించుకోవాలి. రాఘవేంద్ర స్వామి పటాన్ని పూజకు సిద్ధం చేసుకోవాలి. ఏడు వారాలు రాఘవేంద్ర స్వామికి ఉపవసించి పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
 
ఆరు వారాలు ఎప్పటిలా పూజ చేసి.. ఏడో వారం రాఘవేంద్ర స్వామికి తులసీని సమర్పించాలి. రాఘవేంద్ర స్వామి పటం ముంచి పంచముఖ దీపాన్ని వెలగించాలి. పండ్లు, తమలపాకులు, కొబ్బరిని పూజకు సిద్ధం చేసుకోవాలి. విఘ్నేశ్వరునికి పూజ చేసి.. రాఘవేంద్ర స్వామిని ప్రార్థించాలి. పూజకు ముందు స్వామిపై మనస్సును నిలిపి సంకల్పం చెప్పుకోవడం మరిచిపోకూడదు. 
 
శ్రీ గురు రాఘవేంద్రుల వారి పాదాలను స్మరించుకుంటూ భక్తి ప్రపత్తులతో గురుస్తోత్రాన్ని పఠించే వారికి దుఖాలు దూరమౌతాయి. గురువుల ఆనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతోంది.
 
శ్రీ గురు రాఘవేంద్ర యతీంద్రుల అనుగ్రహం మనందరిపై వర్షించాలని ఆశిస్తూ... 
''పూజ్యాయ రాఘవేంద్రాయ 
సత్యధర్మ రతాయచ భజతాం 
కల్పవృక్షాయ నమతాం 
కామధేనవే"
ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే.. అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి. సర్వ మంగళం చేకూరుతుంది. ఈ మంత్రాన్ని పఠించిన తర్వాత ఉపవాసం వున్న వారు ధూపదీప నైవేద్యాలను సమర్పించి.. రాత్రిపూట పాలు పండ్లను తీసుకోవచ్చు. స్వామికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. 
 
గురువారం ఉపవాసం వుండేవారు.. మంచం మీద పడుకోకూడదు. నిష్టతో రాఘవేంద్ర స్వామిని ఏడు వారాలు ఉపవసించి పూజిస్తే అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుధవారం గరుడునిని పూజిస్తే నాగదోషం పరార్.. (video)