Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు తీరాలంటే ఒకటే మార్గం.. శని, ఆదివారాల్లో ఈ పని చేయాల్సిందే..

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (19:25 IST)
ఏ కారణం చేత రుణం తీసుకున్నా అది తీరిపోవాలంటే.. శనీశ్వరుని అనుగ్రహం అవసరం. ఆయన అనుగ్రహంతోనే రుణం తీరుతుంది. రుణ విముక్తి కోసం శనీశ్వరుడిని క్రమం తప్పకుండా పూజించడం అవసరం. ఏలినాటి శని, అష్టమ శని కాలంలో రుణాలు తీసుకోకుండా ఉండడం మంచిది. 
 
చాలామంది ప్రస్తుతం అప్పులపాలై జీవితాన్ని గడుపుతున్నారు. ఎంత సంపాదించినా అప్పులు, వడ్డీలకే ఖర్చు చేస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుందో చూద్దాం. ఓ వ్యక్తి సామాన్యంగా అప్పులు చేయడు. పరిస్థితులు అప్పులపాలు చేస్తాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నప్పుడు రుణం తీసుకోకూడదు. 
 
అదే విధంగా, జాతకంలో గురువు ఆరవ ఇంట్లో ఉన్నప్పుడు, గురు భగవానుడు సర్ప గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, ఎప్పుడూ రుణం తీసుకోకూడదు. రుణం తీర్చాలంటే.. ఇచ్చిన డబ్బు పొందాలంటే.. ఈ క్రింది పరిహారాలను పాటించాలి. 
 
జాతక ప్రకారం, లగ్నానికి అధిపతి 6వ ఇంట్లో శత్రుత్వం కలిగి ఉన్నట్లయితే, లేదా అతను దుష్ట గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నట్లయితే రుణ సమస్యలు ఉంటాయి. ఆ కాలంలో ఇబ్బందులు తప్పవు.
 
ఆదివారం రాహుకాలం సమయం సాయంత్రం 4.30 నుంచి 6 గంటల మధ్య శివాలయంలోని భైరవ సన్నిధికి వెళ్లి కొద్దిగా శుభ్రమైన తెల్లటి గుడ్డలో 27 ఎండుమిర్చి వేసి మట్టి దీపంలో ఆ ముడి వేసి కొబ్బరినూనె పోసి దీపం వెలిగించి పూజించాలి. దీపం వెలిగించిన తర్వాత దీపం చుట్టూ కుంకుమ పెట్టాలి. మూడు వారాలు ఈ పూజ చేస్తే అప్పుల ఇబ్బందులు వుండవు. 
 
అలాగే రుణ విముక్తి కోసం శనీశ్వరుడిని క్రమం తప్పకుండా పూజించడం అవసరం. శనివారం నాడు నువ్వుల నూనె దీపం వెలిగించి పూజిస్తే అప్పుల బాధలు తీరుతాయి. అలాగే తమిళనాడులో శనిక్షేత్రం తిరునల్లారులో శనిభగవానుడిని దర్శించుకుంచే అప్పుల బాధలు తగ్గిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

లేటెస్ట్

వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?

చైత్ర నవరాత్రి 2025: ఇంటిని, ఆత్మశుద్ధికి ఈ నూనెలను వాడితే?

మే నెలలో రాహు కేతు, గురు పరివర్తనం.. కన్యారాశికి అంతా లాభమే

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

01-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

తర్వాతి కథనం
Show comments