Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రావణ అమావాస్య పూజా ఫలితం.. అప్పులు తీర్చుకుంటే..?

Advertiesment
Adhik Maas Amavasya 2023 Date
, మంగళవారం, 15 ఆగస్టు 2023 (17:38 IST)
జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని పితృకారకుడు అంటారు. సూర్యుడు- చంద్రుడు అమావాస్యలలో మాత్రమే కలుస్తారు. కాబట్టి పితృ, మాతృ గ్రహాలుగా వీరిని పిలుస్తారు. అందుకే అమావాస్యను పూర్వీకులు పూజాదినంగా భావిస్తారు. 
 
పితృలోకంలో నివసించే మన పితృదేవతలకు అమావాస్య రోజున తప్పకుండా తర్పణం ఇవ్వాలి. అలా మనం ఇచ్చే తర్పణ ద్రవ్యాలు, నువ్వులు, నీటిని సూర్యభగవానుడు తీసుకువస్తాడని విశ్వాసం. 
 
అమావాస్య రోజున మీరు భూమి కొనుగోలుకు సంబంధించిన చర్చలు ప్రారంభించవచ్చు. అప్పులు తీర్చవచ్చు. ఈ రోజున అప్పులు తీర్చుకుంటే మళ్లీ అప్పుల బాధంటూ వుండదని అంటారు. ఈ ఏడాది బుధవారం ఆగస్టు 16న వస్తోంది. ఇది శ్రావణ అమావాస్య. ఈ రోజున తర్పణం చేయవచ్చు. అమావాస్యలలో శ్రావణ అమావాస్య అత్యంత శుభప్రదమైంది. 
 
శ్రావణ అమావాస్య రోజున పితృ దేవతలు భూమి వైపు ప్రయాణం ప్రారంభిస్తారు. కనుక శ్రావణ అమావాస్య తర్పణం ఇచ్చి పితృదేవతలను తృప్తిపరచి వారి అనుగ్రహాన్ని పొందాలి అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. 
 
ఈ రోజున 12 మందికి మనం తర్పణం చెల్లించాలి. పితృ పక్షంలో ఆరుగురు వ్యక్తులకు తర్పణం ఇవ్వాలి. ఆరు తరాల వారి పేర్లు చెప్పి శ్రాద్ధం ఇవ్వాలి. 
 
మూడు సముద్రాలు కలిసే కన్యాకుమారి, ధనుష్కోటి, రామేశ్వరం అగ్ని తీర్థం వంటి ప్రదేశాలలో ఆది అమావాస్య నాడు సముద్ర స్నానం చేయడం విశేషం. శ్రావణ మాస అమావాస్య రోజున పితృపూజ శుభ ఫలితాలను ఇస్తుంది. 
 
అమావాస్య నాడు చేసే ఎలాంటి నివారణ పూజ అయినా మంచి ఫలితాలను ఇస్తుంది. గురు దోషం, రాహు-కేతు దోషాలు, సర్ప దోషాలు, శని, కుజుడు, కళత్ర దోషం, మాంగల్య దోషాలను అమావాస్య తిథి నాడు పరిహరించడం మంచిది.  
 
ఈ రోజున పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల పూర్వీకులకు సంతోషం కలుగుతుంది. అమావాస్య పూజతో ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ఉంటే అది తొలగిపోతుంది. ఇంట్లో నివసించే వారు సకల సౌభాగ్యాలతో జీవిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15-08-2023 మంగళవారం రాశిఫలాలు - శంకరుడిని పూజించినా మీ సంకల్పం...