Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆపరేషన్ రావణ్ నుంచి చందమామ.. పాట విడుదల చేసిన రాఘవేంద్రరావు

Advertiesment
Operation Raavan team with Raghavendra Rao
, శుక్రవారం, 11 ఆగస్టు 2023 (17:20 IST)
Operation Raavan team with Raghavendra Rao
రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి చందమామ కథలోన అనే లిరికల్ పాటను  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు విడుదల చేశారు. టీమ్ కు తన ఆశిస్సులు అందజేశారు. 
 
శరవణ వాసుదేవన్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ రాయగా..హరి చరణ్, గీతామాధురి పాడారు. చందమామ కథలోన, అందమైన పిల్లేనా, కళ్లముందు కదిలిందా, తుళ్లి తుళ్లి పడ్డానా..అంటూ ప్రేయసి అందాన్ని పొగుడుతూ సాగుతుందీ పాట.
 
ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్ ఇతర కీలక పాత్రల్లో నటించడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆపరేషన్ రావణ్” సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖుషీ మ్యూజికల్ కన్సర్ట్ టిక్కెట్‌లు హాట్‌కేక్‌లుగా అమ్ముడవుతున్నాయి