Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనియన్ చికెన్ గ్రేవీ వంటకం ఎలా చేయాలంటే...

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (20:37 IST)
సౌత్ ఇండియన్ చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా చికెన్ వంటలు స్పైసీగా నోరూరిస్తుంటాయి. ఈ మాంసాహారాల వంటలకు కొన్ని మసాలాలు జోడించి తయారుచేయడం వల్ల మరింత ఎక్కువ రుచి వస్తుంది. ఈ సింపుల్ చికెన్ గ్రేవీ రెసిపికి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, కారం, టమోటోలు అదనపు టేస్ట్‌ను అందిస్తాయి. అంతేకాదు, ఈ చికెన్ రెసిపి తయారుచేయడం చాలా సులభం. ఈ టేస్టీ చికెన్ గ్రేవీ రెసిపి చపాతీలు లేదా తందూరి రోటీలకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆంధ్రా స్టైల్లో తయారుచేస్తే హాట్ అండ్ స్పైసీగా నోరూరిస్తుంటుంది. మరి ఈ ఆనియన్ చికెన్ గ్రేవీ టేస్టీ వంటకాన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు
చికెన్- అరకిలో,
ఉల్లిపాయముక్కలు- రెండు కప్పులు,
టమోటాలు తరిగినవి- ఒక కప్పు,
అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టీస్పూను,
పచ్చిమిర్చి- అయిదు,
పెరుగు- ఒక కప్పు,
కారం- ఒక టీస్పూను,
నూనె- తగినంత,
ఉప్పు- రుచికి సరిపడా,
 
తయారుచేయు విధానం 
ముందుగా పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.  నూనె వేడి అయ్యాక అందులో ఉల్లిపాయలు ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. తర్వాత అందులోనే టమోటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి. టమోటో మెత్తబడే వరకూ 10 నిముషాలు వేగించుకోవాలి. 
 
మరో పాన్‌లో ఆయిల్ వేసి, చికెన్ ముక్కలు వేసి  ఫ్రై చేసుకోవాలి. పది నిముషాల తర్వాత ముందుగా వేపుకుంటున్న పోపులో చికెన్ ముక్కలను ట్రాన్స్‌ఫర్ చేయాలి. మొత్తం మిశ్రమం కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే పెరుగు, కారం వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు మొత్తం మిశ్రమం చిక్కగా మారే వరకూ ఉడికించుకోవాలి. అంతే... ఆనియన్ చికెన్ గ్రేవీ వంటకం రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

తర్వాతి కథనం
Show comments