Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగేముందు పాలను ఎందుకు వేడిచేయాలి?

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (18:42 IST)
మనందరికీ సంపూర్ణ పోషణను అందించే ఆహారాలలో మొదటి స్థానం పాలకే దక్కుతుంది. వీటిని రోజూ తాగడం వల్ల శరీరానికి బలంతోపాటు, కాల్షియం కూడా పుష్కలంగా అందుతుంది. పిల్లల ఎదుగుదలకు పాలు ఎంతగానో దోహదపడతాయి. కానీ పాలను తాగడానికి ముందు వాటిని మరిగించాలి. అలా చేస్తే దానిలోని హానికర బ్యాక్టీరియా నశించిపోతుంది. కానీ, ప్యాకెట్లలో వచ్చిన పాలను మారగించాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. 
 
చాలా మంది ప్యాకెట్ పాలను కూడా బాగా మరిగించి తాగుతారు. దీనివల్ల పోషక విలువలు తగ్గిపోతాయి. ప్యాకెట్ పాలను కొద్దిగా వేడి చేసి తాగితే సరిపోతుంది. ప్యాకెట్ పాలను ఎందుకు మరిగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా డైరీ వాళ్లు పాలను 161.6 డిగ్రీల ఫారెన్‌హీట్ టెంప‌రేచ‌ర్‌కు మరిగించి 15 సెకన్లలో చల్లారుస్తారు. తద్వారా హానికార‌క సాల్మొనెల్లా బ్యాక్టీరియా తొల‌గిపోతుంది. 
 
ఈ ప్రక్రియను పాశ్చ‌రైజేష‌న్ అంటారు. పాశ్చ‌రైజేషన్ చేసిన పాలను మళ్లీ మరిగించాల్సిన అవసరం లేదు. కానీ చల్లగా త్రాగడం ఇష్టంలేని వారు కాస్త వేడి చేసుకుని తీసుకోవచ్చు. ఇక ప్యాకెట్ పాలు కాకుండా నేరుగా గేదెల వ్యాపారుల నుంచి పాల‌ను కొనేవారు మాత్రం ఆ పాల‌ను ఖచ్చితంగా మ‌రిగించాలి. అప్పుడు మాత్రమే సాల్మొనెల్లా బ్యాక్టీరియా నశిస్తుంది. ఆ తర్వాత పాలను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కారు వెనక్కి వస్తుండగా బలంగా ఢీకొట్టిన ట్రక్కు... వీడియో వైరల్

న్యాయ విద్యార్థినిపై అఘాయిత్యం : నలుగురి అరెస్టు

మన్ కీ బాత్ తరహాలో డయలు యువర్ సీఎం : చంద్రబాబు వెల్లడి

రైలు ఆలస్యంగా వచ్చిదనీ రైలింజన్ కిటికీ అద్దాలు ధ్వంసం (Video)

కారంతో అభిషేకం చేయించుకున్న బాబా.. ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

తర్వాతి కథనం
Show comments