Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్న్, చికెన్ గారెలు టేస్ట్ చేశారా?

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (18:10 IST)
వర్షాకాలం, శీతాకాలంలో వేడి వేడిగా వుండే ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలం, శీతాకాలంలో శరీరానికి కాస్త వేడినిచ్చే ఆహారం తీసుకోవాలని న్యూట్రీషియన్లు చెప్తున్నారు. అలా శీతాకాలంలో తీసుకునే ఆహారంలో చికెన్, కార్న్‌లు వున్నాయి. వీటి రెండింటి కాంబోలో గారెలు ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు 
ఉడికించిన బోన్‌లెస్ చికెన్ ముక్కలు : పావు కేజీ 
ఉడికించిన కార్న్ - వంద గ్రాములు 
జీడిపప్పు : వందగ్రాములు 
పుదీనా తరుగు : పావు కప్పు
కొత్తిమీర తరుగు : పావు కప్పు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్
కారం : 2 టేబుల్‌స్పూన్స్
పసుపు : పావు టీస్పూన్
శనగపిండి: 200 గ్రాములు 
బియ్యం పిండి : 50 గ్రాములు 
ఉప్పు, నూనె : తగినంత
 
తయారీ విధానం :
ముందుగా శుభ్రం చేసుకుని పసుపు, ఉప్పుతో ఉడికించిన చికెన్ ముక్కల్ని ఓ వెడల్పాటి బౌల్‌లోకి తీసుకోవాలి. జీడిపప్పును పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని చికెన్ కీమాలో చేర్చాలి.

అలాగే ఉడికించి స్మాష్ చేసుకున్న కార్న్‌, అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఉప్పు, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర, శెనగపిండి, బియ్యం పిండి కొంచెం నీరు పోసి చికెన్ మిశ్రమాన్ని గారెల పిండిలా సిద్ధం చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టాలి. తర్వాత కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. చికెన్ మిశ్రమాన్ని చిన్న వడల్లా చేసి నూనెలో వేయించుకోవాలి. ఈ గారెలను పిల్లలకు టమోటా సాస్‌తో సర్వ్ చేస్తే ఇష్టపడి తింటారు.

సంబంధిత వార్తలు

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

తర్వాతి కథనం
Show comments