Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాన్ వెజ్: చికెన్ 65 గుడ్ పాయింట్స్ ఏంటి? బ్యాడ్ పాయింట్స్ ఏంటి?

Advertiesment
Non Veg Recipe
పకోడీల మాదిరి చికెన్ 65 ముక్కలను మనలో చాలామంది రుచి చూసే వుంటాం. వాటి తినడానికైతే బాగా తినేస్తాం కానీ దాని ద్వారా తెచ్చుకునే క్యాలరీలను కరిగించే పని మాత్రం చేయలేరు చాలామంది. అసలు చికెన్ 65 ద్వారా శరీరానికి అందే క్యాలరీలు, కొవ్వు... వివరాలతోపాటు చికెన్ 65 మంచి చేసేదెంత... చెడు చేస్తున్నదెంతో తెలుసుకుందాం.
 
362 గ్రాముల చికెన్ 65లో ఉండే క్యాలరీలు, కొవ్వులు చూసినప్పుడు... శరీరానికి అందే క్యాలరీలు 249.
 
8 గ్రాముల కొవ్వు అంటే రోజువారీలో 12 శాతం వచ్చేస్తుంది. కొలెస్ట్రాల్ 85 మిల్లీ గ్రాములు చేరుతుంది. రోజువారీ అందే కొలెస్ట్రాల్ లో దీని వాటా 28 శాతం. సోడియం 1208 మిల్లీ గ్రాములు చేరుతుంది. ఇది రోజువారీలో శరీరానికి అందే శాతంలో 50. 
 
పొటాషియం 87 మిల్లీ గ్రాములు, ఇది రోజువారీలో 2 శాతం. కార్బొహైడ్రేట్లు 10.3 గ్రాములు, ఇది రోజువారీలో 3 శాతం. ఫైబర్ 3.3 గ్రాములు, రోజువారీలో 13 శాతం వచ్చేస్తుంది. ఇలా చూసినప్పుడు చికెన్ 65 తీసుకోవడం ద్వారా విటమిన్ సి అత్యధికంగా అందుతుంది కానీ ఎక్కువ మోతాదులో కొలెస్ట్రాల్, సోడియం చేరుతుంది. ఈ రెండూ గుండె ఆరోగ్యానికి మంచివి కావు. అందువల్ల చికెన్ 65 అనేది ఎప్పుడో ఒక్కసారి తినాలి తప్ప వారం కాగానే దాన్ని తింటూ ఉండకూడదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలాంటివారు గేదె పాలు తాగితే ఏమవుతుంది?