Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌‌లో పోటీ పరీక్షలు-స్లీవ్ లెస్ డ్రస్సులు వేసుకోలేదని కత్తిరించేశారు..

బీహార్‌లో పోటీ పరీక్షలు రాసే అమ్మాయిలకు అవమానం జరిగింది. పోటీ పరీక్షలు రాసేందుకు వెళ్లిన అమ్మాయిల దుస్తులను కత్తెరలు బ్లేడులతో కత్తిరించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ

Webdunia
సోమవారం, 14 మే 2018 (09:35 IST)
బీహార్‌లో పోటీ పరీక్షలు రాసే అమ్మాయిలకు అవమానం జరిగింది. పోటీ పరీక్షలు రాసేందుకు వెళ్లిన అమ్మాయిల దుస్తులను కత్తెరలు బ్లేడులతో కత్తిరించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని ముజఫర్ పూర్ జిల్లాలో శనివారం నాడు నర్సింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ టెస్టును బీహార్ కంబైన్డ్ ఎంట్రెన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బోర్డ్ (బీసీఈసీఈబీ) నిర్వహించింది. ఈ పరీక్షలకు అమ్మాయిలు చేతులను పూర్తిగా కప్పి వుండే దుస్తులు హాజరయ్యారు. 
 
స్లీవ్ లెస్ డ్రస్సులు మాత్రమే ధరించి పరీక్షకు వెళ్లాలి. ఈ విషయంలో సరైన అవగాహన లేని చాలామంది అమ్మాయిలు చేతులు కప్పివున్న దుస్తులతో వెళ్లడంతో అధికారులు అమ్మాయిల దుస్తులను కట్ చేశారు. 
 
ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో విద్యాశాఖ విచారణకు ఆదేశించి, భవిష్యత్తులో ఆ సెంటర్‌లో ఏ విధమైన పరీక్షలు జరిపించకుండా నిషేధాన్ని విధించింది. ఈ పరీక్షకు సూపరింటెండెంట్‌గా పనిచేసిన అధికారిని జీవితకాలం పాటు మరోసారి పరీక్షలకు ఇన్‌చార్జ్‌గా వేయకుండా నిషేధించినట్టు జిల్లా విద్యాధికారి లలన్ ప్రసాద్ సింగ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments