నా భార్యే అంటూ యువతితో దిగాడు... 4 రోజులు ఎంజాయ్... శవమై తేలాడు...
తిరుపతి ఆధ్మాత్మిక క్షేత్రం మరోసారి ఉలిక్కిపడింది. ప్రైవేటు హోటల్లో ఒక యువకుడు దారుణ హత్యకు గురవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసేందుకు వచ్చిన ఒక యువకుడు విగతజీవిగా మారిపోయాడు. యువకుడి హత్యకు అతనితో పాటు వచ్చిన మహిళ కారణమా
తిరుపతి ఆధ్మాత్మిక క్షేత్రం మరోసారి ఉలిక్కిపడింది. ప్రైవేటు హోటల్లో ఒక యువకుడు దారుణ హత్యకు గురవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసేందుకు వచ్చిన ఒక యువకుడు విగతజీవిగా మారిపోయాడు. యువకుడి హత్యకు అతనితో పాటు వచ్చిన మహిళ కారణమా లేకుంటే వేరే కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. నగరంలో యువకుడి హత్య పోలీసులకు సవాల్‌గా మారింది.
తిరుపతి నగరంలో ఏ సంఘటన జరిగినా ఒక సంచలనమే. ప్రతిరోజు వేలాదిమంది భక్తులు వచ్చి వెళ్ళే ప్రాంతంలో భద్రత అదే స్థాయిలో ఉంటుంది. కానీ ఈమధ్యకాలంలో నగరంలో హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా తిరుపతి నగరంలోని రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఒక లాడ్జీలో యువకుడి హత్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీకి చెందిన 35 యేళ్ళ మోహన్ మరో మహిళతో కలిసి ఈ నెల 4వ తేదీన తిరుపతికి వచ్చాడు. తనతో పాటు ఉన్న మహిళ భార్యగా హోటల్ సిబ్బందికి చెప్పాడు.
పుణ్యక్షేత్రాల సందర్శన కోసం వచ్చామని, కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేద్దామనుకుంటున్నామని హోటల్ సిబ్బందికి చెప్పి గదిని అద్దెకు తీసుకున్నాడు. 5, 6వ తేదీ తాము నెల్లూరుకు వెళుతున్నామని చెప్పాడు. ఆ తరువాత 6వ తేదీ మధ్యాహ్నం గదికి వచ్చాడు. మళ్ళీ తిరుమలకు వెళుతున్నానని చెప్పాడు. 7వ తేదీ మధ్యాహ్నం గదికి వచ్చాడు. ఢిల్లీకి వెళ్ళిపోవాలని గదిని ఖాళీ చేసి రైల్వేస్టేషన్‌కు వెళ్ళాడు. ట్రైన్ మిస్సయ్యిందని చెప్పి తిరిగి అదే హోటల్‌కు వచ్చి గదిని తీసుకున్నాడు.
8వ తేదీ తెల్లవారుజామున ఢిల్లీకి వెళతామని చెప్పాడు. అయితే ఉదయం 6గంటల సమయంలో మోహన్‌తో పాటు వచ్చిన మహిళ హడావిడిగా హోటల్ రిపెస్షన్ వద్దకు వెళ్ళి నేను బయటకు వెళుతున్నాను.. నాకు పని ఉంది. నా భర్త తరువాత వస్తాడని వెళ్లిపోయింది. గది నుంచి ఎలాంటి శబ్దం లేకపోవడంతో హోటల్ సిబ్బంది కిటికీ తెరిచి చూశారు. మోహన్ విగతజీవిగా కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతి ఈస్ట్ పోలీసులు రంగంలోకి దిగారు.
మోహన్‌తో పాటు వచ్చిన మహిళ భార్యా లేకుంటే ఇంకెవరైనా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. మోహన్ నెల్లూరుకు వెళ్లినప్పుడు మొబైల్‌లో తీసుకున్న ఫోటోలను కూడా గుర్తించారు పోలీసులు. ఆ ఫోటోలో మరో మహిళ, ఒక యువకుడు కూడా ఉన్నారు. ఒకవేళ వారేమైనా హత్యకు కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు అక్రమ సంబంధం హత్యకు కారణమా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నాలుగు బృందాలుగా ఏర్పడి లోతుగా విచారణ జరుపుతున్నారు.