Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pregnant: మరదలిని గర్భవతిని చేశాడు.. జీవితఖైదు విధించిన కోర్టు.. లక్ష జరిమానా

సెల్వి
శుక్రవారం, 14 మార్చి 2025 (19:40 IST)
దేశంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. మహిళలపై అత్యాచార ఘటనలు కూడా పెరుగుతున్నాయి. అదేవిధంగా, గృహ హింస రోజురోజుకూ పెరుగుతోంది. గృహ హింసకు సంబంధించిన కేసులు కోర్టులలో పేరుకుపోతున్నాయని గణాంకాలు ద్వారా తెలుస్తోంది. తాజాగా మరదలిని గర్భం చేసిన కేసులో ఓ వ్యక్తికి జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది.
 
వివరాల్లోకి వెళితే.. రాజ్ కుమార్ నాయక్ ఒరిస్సా రాష్ట్రానికి చెందినవాడు. అతనికి 28 సంవత్సరాలు, వివాహితుడు. జీవనోపాధి కోసం 2018 డిసెంబర్‌లో తన కుటుంబంతో కలిసి చెన్నైకి వచ్చాడు. ఆ సమయంలో, ఇంటికి వచ్చిన భార్య సోదరి 16 ఏళ్ల మరదలిని గర్భం చేశాడు. 
 
దీనికి సంబంధించి 2019 నవంబర్‌లో ఎన్నూర్ మహిళా పోలీసులలో కేసు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి తిరువళ్లూరు మహిళా కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో తొమ్మిది మంది సాక్షులను విచారించారు. 
 
ఈ కేసు విచారణకు సంబంధించి తీర్పు వెలువడింది. అందులో, రాజ్‌కుమార్ నాయక్‌కు జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా విధించాలని, జరిమానా చెల్లించని పక్షంలో 3 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి సరస్వతి ఆదేశించారు. దీని తరువాత, రాజ్‌కుమార్ నాయక్‌ను చెన్నై పుళల్ సెంట్రల్ జైలులో ఉంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu : తెలుసు కదా చిత్రం నుంచి సిద్ధు జొన్నలగడ్డ హోలీ పోస్టర్

తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశాను.. క్షమించండి : సుప్రీతి

Supreeta: నన్ను క్షమించండి అంటున్న సురేఖ వాణి కూతురు సుప్రీత

AKhil: చిత్తూరు, హైదరాబాద్ లోనే అఖిల్ కొత్త సినిమా షూటింగ్

Samyuktha: హైదరాబాద్ లో అఖండ 2 షూట్, బాలక్రిష్ణ వుంటే అందరికీ ఎనర్జీనే: సంయుక్తమీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments