Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

Advertiesment
Prashanthi Tipirneni, Deepthi Ganta

దేవీ

, గురువారం, 13 మార్చి 2025 (16:30 IST)
Prashanthi Tipirneni, Deepthi Ganta
కథల ఎంపిక ఎలా వుంటుందంటే..  జానర్ ఏదైనా కథలో నిజాయితీ వుండాలి. కథలో హానెస్టీ, డైరెక్టర్ లో క్లారిటీ వుంటే ముందుకు వెళ్తాం. నాని గారు ఇదే చూస్తారు అని ప్రశాంతి అన్నారు.  నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్ చేస్తున్న మూవీ 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన చిత్రమిది.

ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
దీప్తి: నాని, ప్రశాంతి గారు స్క్రిప్ట్ విని ఓకే చేశారు. నేను ఆన్సెట్ ప్రొడ్యూసర్ గా జాయిన్ అయ్యాను. నేను రోజు సెట్స్ లో వుండేదాన్ని. నాని, ప్రశాంతి నాకు చాలా ప్రీడమ్ ఇచ్చారు. నేను స్క్రిప్ట్ మొత్తం చదివాను. డైరెక్టర్ జగదీష్ చాలా బాగా రాసుకున్నాడు. చాలా లేయర్స్ వున్నాయి. అన్నీ బాగా కనెక్ట్ చేసుకున్నాడు. స్క్రీన్ ప్లే చాలా టైట్ గా ఉంటుంది. కథ నాకు చాలా నచ్చింది.
 
- హిట్ 3 స్టేక్స్ చాలా పెద్దవి.. కానీ నాని గారు కోర్టు నచ్చకపొతే హిట్ 3 చూడొద్దని చెప్పడం మాకు  షాకే. నేను ప్రశాంతి డైరెక్టర్ శైలేష్ వంక చూశాం. తనకి నమ్మకం వుంది కాబట్టే ఆ మాటని కాన్ఫిడెంట్ గా చెప్పారు.
 
- నా దర్శకత్వంలో సినిమా వుంటుంది. నేను 'మీట్ క్యుట్' చేసిన తర్వాత యు ఎస్ వెళ్ళిపోయాను. ఈ సినిమా కోసం మళ్ళీ వచ్చాను. కొన్ని ఐడియాలు వున్నాయి. వాటిని స్క్రిప్ట్ గా డెవలప్ చేయాలి.
 
ప్రశాంతి: ప్రిమియర్స్ కి యునానిమస్ గా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ అఫ్ చూసి 'వావ్' అన్నారు. సెకండ్ హాఫ్ కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. సెకండ్ హాఫ్ లోని హైలెట్స్ కూడా ఆడియన్స్ కి చాలా నచ్చాయి. రెస్పాన్స్ చాలా బావుంది. మేము అనుకున్నదాని కంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి జోనర్ సినిమాని ఆడియన్స్ ఆదరించి బిగ్ సక్సెస్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాం.  
 
- ఈ కథకు మంచి యాక్టర్స్ కావాలి. ఆ విషయంలో రాజీ పడలేదు. ప్రియదర్శి తో పాటు రోహిణీ, సాయి కుమార్, శివాజీ, హర్ష వర్ధన్ .. ఇలా మంచి యాక్టర్స్ వున్నారు. రోషన్, శ్రీదేవి కూడా వారి పాత్రలకు పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం