'కోర్ట్' సినిమాని మీరు మిస్ అవ్వకండి. నా కెరియర్ లో ఎప్పుడూ కూడా దయచేసి సినిమా చూడండి అని అడగలేదు. కానీ ఈ సినిమా కడుగుతున్నాను. దయచేసి ఈ సినిమా చూడండి. 14న థియేటర్ కి వెళ్ళండి అని :నేచురల్ స్టార్ నాని అన్నారు.
నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పించిన మూవీ 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా విడుదల కానుంది.
Nani, Ram Jagadish, Prashanthi Tipirneni, Deepthi Ganta, priyadarshi
ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ ప్రీరిలీజ్ & ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు. డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, ఇంద్రగంటి మోహన కృష్ణ, దేవకట్టా ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు.
అనంతరం నాని మాట్లాడుతూ, ఇలాంటి మంచి సినిమా మీరు మిస్ అవ్వకూడదని చెబుతున్నాను. మాకేదో సక్సెస్ రావాలని కాదు. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి మంచి సినిమాని మిస్ కాకూడదని చెబుతున్నాను. మీ అందరిని బ్రతిమాలుతున్నాను. ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళండి. గొప్ప సినిమా చూశారానే ఫీలింగ్ తో వస్తారు. ఒకవవేళ 14న కోర్ట్ సినిమాకి వెళ్లి నేను చెప్పిన అంచనాలని మ్యాచ్ కాలేదని అనిపిస్తే...ఇంకో రెండు నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3ని ఎవరూ చూడొద్దు. ఇంతకంటే బలంగా చెప్పలేను. సినిమా చూసినప్పుడు నాకు గొప్ప ఎక్స్ పీరియన్స్ కలిగింది. సినిమా చూసిన తర్వాత మీరే అందరికీ చెబుతారు. టీం అందరికీ కంగ్రాట్స్ అండ్ థాంక్ యూ. తెలుగు సినిమాకి గ్రేట్ కోర్ట్ రూమ్ డ్రామా ఇచ్చారు అన్నారు.
ప్రియదర్శి మాట్లాడుతూ, బలగం తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఈ సినిమా చేయమని చెప్పారు. మా టీమ్ అంతా ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణం నాని అన్న. ఇది కూడా ఒక సూపర్ హీరో లాంటి కథ. కోటేసుకున్న ప్రతిసారి ఒక బ్యాట్మెన్ లో ఫీల్ అయ్యా. 14న థియేటర్లో కలుద్దాం. సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుందాం'అన్నారు.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, ఫస్ట్ సినిమాకి ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో దర్శకుడు జగదీష్ ఫేస్ లో కనిపించింది. పదేళ్ల క్రితం ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకి నేను కూడా అదే పొజిషన్లో ఉన్నాను. అప్పటినుంచి ఇప్పటివరకు నేను ఒక మూడు సినిమాలు చేశాను. కానీ నాని ఒక 20 సినిమాలు చేశారు. యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా ఇంత స్పీడ్ గా ఎలా చేస్తున్నారని చాలా సార్లు అడిగాను. నిజంగా అది గొప్ప లెగసి. ఈ సినిమా మ్యాసీవ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'అన్నారు.
నిర్మాత దీప్తి మాట్లాడుతూ.. నలుగురు సినిమా పిచ్చోళ్ళు ఒక చోటికి చేరితే సినిమా ఎలా వస్తుందో కోర్టు అలా ఉంటుంది. జగదీష్ విజన్ స్క్రీన్ మీద ఒక పోయెట్రీ క్రియేట్ చేసింది. విజయ్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. దర్శి చాలా అద్భుతంగా నటించాడు. రోషన్ శ్రీదేవి ఆడియన్స్ కి గుర్తుండిపోతారు ఇది చాలా బ్యూటిఫుల్ మూవీ మార్చి 14న అందరూ థియేటర్లో చూస్తారని కోరుకుంటున్నాను'అన్నారు
డైరెక్టర్ రామ్ జగదీష్ మాట్లాడుతూ, ప్రశాంతి గారు దీప్తి గారు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రోషన్ శ్రీదేవి ఈ సినిమాకి హార్ట్ అండ్ సోల్. దర్శి అన్నకి బలగం ముందు ఈ కథ చెప్పాను. అప్పటికీ ఇప్పటికీ ఒకేలా వున్నారు. నాని గారు వన్ అండ్ ఓన్లీ. నాని ప్రోడక్ట్ కావడం చాలా ఆనందంగా వుంది. ఇదొక గొప్ప లెగసీ. ఆయన నమ్మిన విధానం అద్భుతం. అది చాలా బాధ్యత పెంచింది. 14 తారీకు ఆ నమ్మకాన్ని తిరిగి ఇచ్చేస్తాను. కోర్టు మన అందరికీ జీవితం. థియేటర్స్ కి రండి. ఆ రోజు మాట్లాడుకుందాం'అన్నారు.
యాక్టర్ హర్ష రోషన్ మాట్లాడుతూ, ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా. ప్రతి ఒక్కరూ వెళ్లి చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఏజ్ గ్రూప్ చూడాల్సిన సినిమా.అన్నారు.
యాక్టర్ శివాజీ మాట్లాడుతూ.. నేను 13 ఏళ్ల తర్వాత చేసిన సినిమా ఇది. ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో మంగపతి క్యారెక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ నాకు చాలా పెద్ద పేరు తీసుకురాబోతుందని బలంగా నమ్ముతున్నాను. నాని బ్యానర్ నుంచి మరెన్నో గొప్ప సినిమాలు రావాలని కోరుకుంటున్నాను'అన్నారు.