Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

Advertiesment
Director Ram Jagadish,  Court poster

దేవీ

, బుధవారం, 12 మార్చి 2025 (17:05 IST)
Director Ram Jagadish, Court poster
ఫోక్సో చట్టం  చాలా ముఖ్యమైన ఆక్ట్. నిజానికి ఆ చట్టం గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు. దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తే బాగుంటుందని అనిపించింది. అది కోర్ట్ సినిమాలో చూస్తారు.. అని డైరెక్టర్ రామ్ జగదీష్ తెలిపారు.
 
నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్ చేస్తున్న మూవీ 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం మార్చి 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ జగదీష్ సినిమా విశేషాలు ఇలా పంచుకున్నారు.
 
-ఈ కథ ఫోక్సో యాక్ట్ నేపథ్యంలో ఉంటుంది. నిజజీవితంలో ఇలాంటి ఒక కేసుని నేను పరిశీలించాను. ఆ కేసు గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా ఇలా కూడా ఉంటుందా అని సందేహంగా అనిపించింది. ఇలాంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయని తెలిసింది. ఆ కేసులు అన్నిటి మీద కూడా రీసెర్చ్ చేశాను. ఏపీ తెలంగాణలో వందల కేసులు ఉన్నాయి. ఇవన్నీ స్క్రీన్ మీద అడ్రస్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఈ కథ కోసం చాలా కేసు ఫైల్స్ చదివాను. అన్ని కేస్ ఫైల్స్ లో ఉన్న మెటీరియల్ తో ఒక మంచి కథ చెప్పొచ్చు కదా అనిపించింది. అవన్నీ ఒక కథగా చేసి స్క్రీన్ పై చూపించడం జరిగింది.
 
-ఇది పర్టికులర్ ఒక పర్సన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కి సంబంధించిన కథ కాదు. చాలా సంఘటనల స్ఫూర్తి ఉంది. ఇది కంప్లీట్ గా ఫిక్షనల్ కథ. చదివిన కేసుల ఎసెన్స్ తో ఒక ఫిక్షనల్ స్టోరీ చేయడం జరిగింది.
 
-ఈ సినిమా కోసం ఫోక్సో యాక్ట్ గురించి క్షుణ్ణంగా చదువుకున్నాను. కోర్టు, లా, పోలీస్ కి సంబధించిన చాలా మందిని కలసి చాలా విషయాలు గ్యాదర్ చేశాను.    
 
-నాని గారికి కథ చెప్పడం వెరీ హ్యాపీ మూమెంట్. ఆయనకి కథ చెప్పడానికి దాదాపు 8 నెలలు వెయిట్ చేశాను. ఫైనల్ గా ఆయన కథ వినే మూమెంట్ వచ్చింది. ఆయన కథ విన్న విధానం చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. దాదాపు రెండున్నర గంటల కథని సింగిల్ సిటింగ్ లో విన్నారు. కథ మొత్తం విని నిల్చుని షేక్ హ్యాండ్ ఇచ్చి 'వెల్కమ్ టు వాల్ పోస్టర్ సినిమా' అన్నారు. అది నా జీవితంలో హై మూమెంట్. అది నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్.
 
చాలా కోర్ట్ రూమ్ డ్రామాలు వచ్చాయి కదా ఈ సినిమా ఎంత ప్రత్యేకంగా ఉండబోతుంది?
-చాలా కోర్ట్ రూమ్ డ్రామాలు చూసాం. కానీ ఒక లవ్ స్టోరీ ని కోర్ట్ రూమ్ డ్రామాగా ఎప్పుడు చూడలేదని భావిస్తున్నాను. ఇందులో లవ్ స్టోరీ, కోర్ట్ రూమ్  డ్రామా చాలా ప్రత్యేకంగా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి