రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగుకు అక్కినేని నాగార్జున గత కొన్ని సీజన్లుగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్, రెండవ సీజన్‌కు నాని యాంకరింగ్ చేశారు. ఇక మూడవ సీజన్ నుంచి నాగార్జున బిగ్ బాస్ తెలుగుకు హోస్ట్‌గా మారారు.
నాగార్జున సంవత్సరాలుగా ఈ షోను సక్సెస్ ఫుల్‌గా రన్ చేశారు. ప్రసార ఎడిషన్‌ను హోస్ట్ చేయడంతో పాటు, ఓటీటీ వెర్షన్, బిగ్ బాస్ తెలుగు నాన్‌స్టాప్‌ను కూడా హోస్ట్ చేశారు.
అయితే, బిగ్ బాస్ తెలుగు 8కి మంచి క్రేజ్ రాలేదు. దీంతో పాటు వరుస సీజన్లకు హోస్ట్‌గా పనిచేసిన నాగార్జున అలసిపోయారని.. అంతేగాకుండా ఈ షో నుంచి నిష్క్రమించాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.
2024 సంక్రాంతి సందర్భంగా విడుదలైన నా సామి రంగ తర్వాత, అతను ప్రధాన హీరోగా ఏ సినిమాలోనూ నటించలేదు. ప్రస్తుతం ఆయన కూలీ, కుబేర చిత్రాలలో సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవల, కమల్ హాసన్ తన నటనా జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడానికి తమిళ "బిగ్ బాస్"ను హోస్ట్ చేయడం మానేశాడు. నాగార్జున కూడా అదే బాటలో వెళ్తాడా? నాగార్జున నిజంగా ఈ షోను హోస్ట్ చేయడం మానేస్తాడా లేదా కొత్త ఉత్సాహంతో తిరిగి వస్తాడా అనేది తెలియాలంటే వేచి చూడాలి.