Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

Advertiesment
nagarjuna

ఠాగూర్

, గురువారం, 28 నవంబరు 2024 (12:10 IST)
అక్కినేని కుటుంబంలో వరుస వివాహ వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత హీరో నాగ చైతన్య, ఆ తర్వాత అఖిల్ అక్కినేని వివాహాలు జరుగనున్నాయి. తమ కుటుంబంలో వరుస శుభకార్యాలు జరగడంపై అగ్ర హీరో అక్కినేని నాగార్జున ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. అయితే వీరిద్దరి వివాహం ఒకే వేదికపై జరుగుతుందని జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఓ ఇంటర్వూలో తెలిపారు. 
 
2024 తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైందిగా నాగార్జు తెలిపారు. ఓవైపు ఏఎన్నార్ శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. మరోవైపు  తనయులిద్దరూ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నారని గుర్తుచేశారు. డిసెంబరు 4వ తేదీన నాగచైతన్య - శోభిత పెళ్లి జరుగనుంది. పెళ్లి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏఎన్నార్ స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ పెళ్లి జరగడం ఆనందంగా ఉందన్నారు. 
 
మా కుటుంబం ఎంతో పెద్దది. అదేవిధంగా శోభిత వాళ్ల కుటుంబం కూడా పెద్దదే. కుటుంబ సభ్యులు, తక్కువమంది అతిథుల సమక్షంలో వేడుకను  చేయాలనుకుంటున్నాం. అఖిల్ కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. జైనబ్ ఎంతో మంచి అమ్మాయి. ఇతరులపై ఎంతో ప్రేమ, అభిమానం కలిగివుంటుంది. వారిద్దరూ కలిసి జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉంది. అఖిల్ జీవితాన్ని ఆమె పరిపూర్ణం చేయగలదని, ఆమెను సంతోషంగా మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. వచ్చే యేడాదిలో వీరి పెళ్లి జరగనుందని నాగార్జున వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దివ్యప్రభ న్యూడ్ వీడియో... సోషల్ మీడియాలో వైరల్... పాపులారిటీ కోసమేనా (Video)