Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరాయి మహిళతో వివాహేతర సంబంధం.. భర్తను అడ్డంగా నరికేసిన భార్య

Woman
Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (12:05 IST)
వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య నరికి చంపేసింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిక్కమాగళూరు జిల్లా హోస్‌పేటకు చెందిన చంద్ర గౌడ (54) భార్య ఇంద్రమ్మతో కలిసి నివసించేవాడు. ఐతే భార్య ఉన్నప్పటికీ వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు చంద్రగౌడ. గతంలో ఓ కాఫీ ప్లాంటేషన్‌లో పనిచేస్తున్న సమయంలో ఓ మహిళ పరిచయమైంది. ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది.
 
చంద్రగౌడ జీవితంలోకి వచ్చిన ఈ మహిళ.. వారి పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. వీరిద్దరి వివాహేతర సంబంధం గురించి భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. పూర్తిగా ప్రియురాలి మోజులో పడిన చంద్రగౌడ.. భార్య దగ్గరకు వెళ్లడం మానేశాడు. దాదాపుగా ఏడాది పాటు అసలు భార్య దగ్గరకు వెళ్లలేదు. ఈ క్రమంలో భర్తపై కోపం పెంచుకుంది ఇంద్రమ్మ. 
 
తనకు అన్యాయం చేసి మరో మహిళలతో ఉంటున్నాడనే ఆగ్రహంతో ఊగిపోయేది. ఈ క్రమంలో మంగళవారం భార్య వున్న గ్రామానికి వెళ్లాడు చంద్రగౌడ. ఆ రోజు రాత్రి ఆమె ఇంట్లోనే ఉన్నాడు. అప్పటికే భర్తపై పీకలదాక కోపంతో ఉన్న ఇంద్రమ్మ.. చంద్రగౌడ్‌ను చంపేయాలని ప్లాన్ చేసింది. అందుకు ఇదే మంచి సమయమని భావించి పథకాన్ని పక్కాగా అమలు చేసింది.
 
రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత.. చంద్రపై కత్తితో దాడి చేసింది. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంద్రమ్మను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments