Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనుమానిస్తోందనీ భార్య పీక నులిమి చంపేసిన భర్త!

అనుమానిస్తోందనీ భార్య పీక నులిమి చంపేసిన భర్త!
, గురువారం, 27 ఆగస్టు 2020 (11:09 IST)
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య... నిత్యం అనుమానించడాన్ని భరించలేక పోయిన ఆ భర్త.. భార్య పీకనులిని చంపేశాడు. ఈ దారుణం విశాఖపట్టణం జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలోని పద్మనాభంలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. విజయనగరం పట్టణానికి చెందిన పల్లి నవీన్‌ కుమార్‌ (27), పద్మనాభం మండలం విలాస్‌ఖాన్‌పాలెం గ్రామానికి చెందిన చెల్లూరి సంతోష్‌‌కు మంచి స్నేహితుడు. సంతోష్‌ కుమార్తె లలిత జన్మదిన వేడుకలకు 2014లో విలాస్‌ఖాన్‌పాలెంకు నవీన్ వచ్చాడు. అపుడు సంతోష్‌ సోదరి చెల్లూరి పద్మ(25)తో పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది. 
 
అయితే, నవీన్ తల్లిదండ్రులు మాత్రం తమ బంధువుల అమ్మాయితో వివాహం జరిపించాలని మాట్లాడుకున్నారు. దీంతో నవీన్... ఎవరికీ చెప్పకుండా 2015లో పద్మను సింహాచలంలో తన స్నేహితుడి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. 
 
అనంతరం పద్మనాభం గ్రామంలో అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. నవీన్‌ ఆరిలోవ హెల్త్‌సిటీలోని ఓ ఆస్పత్రిలో ఫార్మాసీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పద్మ అనుమానించసాగింది.
 
ఈ క్రమంలో నిత్యం నవీన్‌ ఫోన్‌ పరిశీలిస్తూ అనుమానించేంది. ఈ క్రమంలో ఆదివారం విధులకు వెళ్లి రాత్రి 9.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన నవీన్‌కు, పద్మకు మధ్య ఘర్షణ జరిగింది. భర్త ఫోన్‌ తీసుకుని కాల్‌ లిస్ట్‌ పరిశీలించింది. 
 
తనను ప్రేమ వివాహం చేసుకుని సరిగా చూడకుండా వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావని ఘర్షణకు దిగింది. తనకు రూ.4 లక్షలు ఇచ్చి వదిలేయాలని కోరింది. అయితే అంత మొత్తం ఒకేసారి ఇవ్వలేనని, విడతలు వారీగా డబ్బులు ఇస్తానని నవీన్‌ చెప్పాడు. 
 
అందుకు నిరాకరించిన పద్మ విజయనగరంలోని మీ తల్లిదండ్రులకు అంతా చెప్పేస్తానని బెదిరించింది. దీంతో మనస్తాపానికి గురైన నవీన్‌ కుమార్‌ ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో పద్మ పీక నులిమి హతమార్చాడు. అనంతరం తన భార్య కడుపునొప్పితో చనిపోయిందని స్థానికులకు, బావమరిది సత్యనారాయణకి ఫోన్‌ చేసి చెప్పాడు. 
 
దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతురాలు సోదరుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు ఏసీపీ రవి శంకర్‌ రెడ్డి ఆధ్యర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. నిందితుడు నవీన్‌ పోలీసుల అదుపులో ఉన్నాడని విశ్వసనీయ సమాచారం అధారంగా తెలిసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించలేదనీ ఇంటర్ విద్యార్థిని సూసైడ్!!