Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాపై 139 మంది అత్యాచారం చేశారు, తెలంగాణ యువతి ఫిర్యాదులో సినిమావాళ్లు, పొలిటీషియన్స్

Advertiesment
raped
, గురువారం, 27 ఆగస్టు 2020 (14:25 IST)
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 25 ఏళ్ల మహిళ లైంగిక వేధింపులు కేసు సంచలనంగా మారింది. తనపై తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని కొంతమందితో సహా 139 మంది దాడి చేసినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ప్రకారం, 5,000 సార్లకు పైగా తను సామూహిక అత్యాచారంతో సహా వేధింపులు, దాడికి గురైనట్లు తేలింది.
 
పంజాగుట్టలోని పోలీసులు ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 376 (2) (ప్రభుత్వ ఉద్యోగి తన అధికారిక స్థానాన్ని సద్వినియోగం చేసుకొని అత్యాచారానికి పాల్పడటం), 509 (ఒక మహిళ యొక్క నమ్రతను అవమానించడం), 354 (క్రిమినల్ ఫోర్స్‌తో దాడి) తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 
ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ జరిగిందని స్టేషన్ హౌస్ అధికారి నిరంజన్ రెడ్డి తెలిపారు. మహిళా సంఘం నాయకులు, తెలుగు చిత్ర పరిశ్రమ సభ్యులు, మీడియా ప్రముఖులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులకు సహాయకులు వంటి వారిని నిందితులుగా మహిళ పేర్కొంది. కొందరు ఎఫ్‌ఐఆర్‌లో పేరు పెట్టగా, మరికొందరు పేరు పెట్టలేదు.
 
మహిళ వివరాలను చూస్తే... జూన్ 2009లో నగరంలోని మిర్యాలగూడ ప్రాంతంలో ఒక వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత నుంచి సదరు మహిళకు అగ్ని పరీక్ష ప్రారంభమైంది. విడాకులు తీసుకొని ఉన్నత చదువుల కోసం తిరిగి తన మాతృ గృహంలోకి వెళ్ళే వరకు తొమ్మిది నెలలు తన భర్త బంధువులు, కుటుంబ సభ్యులచే లైంగిక వేధింపులకు గురయ్యారని ఆ మహిళ ఆరోపించింది.
 
అయినప్పటికీ అనేక మంది వ్యక్తులు ఆమెను లైంగికంగా దోపిడీ చేస్తూ, ఆ సమయంలో తీసిన వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ తనపై లైంగిక వేధింపులు కొనసాగయని ఆమె పేర్కొంది. ఆమెపై అనేకసార్లు సామూహిక అత్యాచారం జరిగిందని, తరువాత బలవంతంగా గర్భస్రావం చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. ఆమెను మాదకద్రవ్యాలు, సిగరెట్లతో కాల్చి, బలవంతంగా నగ్నంగా నృత్యం చేయించినట్లు ఎఫ్ఐఆర్ పేర్కొంది.
 
తనపై యాసిడ్, పెట్రోల్ పోసి చంపేస్తామని కొందరు బెదిరించారని 25 ఏళ్ల ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అందుకే ఫిర్యాదు చేయడానికి ఆమెకు సమయం పట్టింది, ఎందుకంటే నిందితులు కులం పేరిట బెదిరింపులకు పాల్పడుతుండటంతో భయం వేసి ఫిర్యాదు చేయలేదని, ఒక ఎన్జిఓ తనకు నైతిక మద్దతు ఇచ్చిన తరువాత ధైర్యంతో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. కాగా అత్యాచారం చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని బుధవారం నాడు ఏబీవిపి కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఆందోళకు దిగారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్‌ గ్రూప్‌ కాలింగ్‌లో కొత్త ఫీచర్.. ఇంకా పర్మినెంట్ మ్యూట్ ఆప్షన్..