Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెల్లిపై ద్వేషంతో కిడ్నాప్ చేసి స్నేహితులతో కలిసి రేప్ చేసిన అన్న.. ఎక్కడ?

Advertiesment
చెల్లిపై ద్వేషంతో కిడ్నాప్ చేసి స్నేహితులతో కలిసి రేప్ చేసిన అన్న.. ఎక్కడ?
, బుధవారం, 26 ఆగస్టు 2020 (10:05 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పేగు తెంచుకుని పుట్టిన చెల్లిని కిడ్నాప్ చేసిన సోదరుడు.. ఏకంగా తన ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యాచాం చేసి చంపేశాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో వెలుగుచూసింది. బాధితురాలు ఓ దివ్యాంగురాలు కావడం గమనార్హం. 
 
పోలీసులు అందించిన వివరాల మేరకు.. జైపూర్ నగరంలో గత మే 17వ తేదీన ఓ దివ్యాంగురాలిపై అత్యాచారం జరిపి హత్య చేశారు. ఈ కేసును పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు చేసినట్టుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూసింది. 
 
ఈ కేసులో మృతురాలి సొంత సోదరుడే (20) బాలికను కిడ్నాప్ చేసి, తన ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యాచారం చేసి హత్య చేశారని జైపూర్ పోలీసుల దర్యాప్తులో తేలింది. జైపూర్ రూరల్ అదనపు ఎస్పీ సులేష్ చౌదరి నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ కేసు మిస్టరీని ఛేదించింది. సోదరి అంటే ద్వేషంతో సొంత సోదరుడే చెల్లెల్ని కిడ్నాప్ చేసి, తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ దురాగతానికి పాల్పడినట్లు తేలిందని ఎస్పీ చెప్పారు. 
 
మే 17వ తేదీన తన తల్లి జీన్స్, టీషర్టు కొనివ్వడంతో బాలిక సంతోషంగా ఉందని, అప్పుడు సోదరుడే తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెను కిడ్నాప్ చేసి, ఆమెకు మొబైల్ ఫోనులో నగ్న చిత్రాలు చూపించి అత్యాచారం చేసి హత్య చేశారని సులేష్ చెప్పారు. ఈ సంఘటన జరిగిన స్థలంలో మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు తీగ లాగితే డొంక కదిలినట్లు సోదరుడితో పాటు అతని ముగ్గురు స్నేహితులను గుర్తించి అరెస్టు చేసినట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత మార్కెట్లోకి.. జియోనీ మాక్స్ స్మార్ట్‌ఫోన్‌ ధరెంతంటే?