Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధువుపై గొడ్డలితో దాడి చేసిన బీజేపీ నేత మొదటి భార్య

జార్ఖండ్ రాష్ట్రంలోని జెంషెడ్‌పూర్‌లో స్థానిక బీజేపీ నేతకు చెందిన భార్య వరకు వధువుపై గొడ్డలితో దాడి చేసింది. అయితే, అదృష్టవశాత్తు ఆ వధువు ప్రాణాలతో బయటపడింది. అప్పటికీ ఆ యువతిని ఆ వివాహిత వదిలిపెట్టలే

Webdunia
గురువారం, 18 జనవరి 2018 (11:38 IST)
జార్ఖండ్ రాష్ట్రంలోని జెంషెడ్‌పూర్‌లో స్థానిక బీజేపీ నేతకు చెందిన భార్య వరకు వధువుపై గొడ్డలితో దాడి చేసింది. అయితే, అదృష్టవశాత్తు ఆ వధువు ప్రాణాలతో బయటపడింది. అప్పటికీ ఆ యువతిని ఆ వివాహిత వదిలిపెట్టలేదు. వెంటపడి పట్టుకునిమరీ చితకబాదింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పెళ్లి జరుగుతుండగా వరుడి మొదటి భార్య గొడ్డలితో వచ్చి వధువుపై దాడి చేసిన ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జంషెడ్‌పూర్‌లోని స్థానిక సుందర్‌నగర్‌కు చెందిన బీజేపీ నేత సుబోధ్ లోహ్రాకు సునీతా లోహ్రా అనే మహిళతో ఇదివరకే వివాహమైంది. అయితే అదే ప్రాంతానికి చెందిన పూజా కర్మ్‌కార్ అనే మరో యువతితో సుబోధ్ ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ, పెళ్లికి మాత్రం సుబోధ్ నిరాకరించాడు. దీంతో పూజ పోలీసులను ఆశ్రయించింది.
 
రాజీ కుదిర్చిన పోలీసులు.. తమ బలంతో వారిద్దరికీ పెళ్ళి తంతు కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ విషయం సుబోధ్ మొదటి భార్య సునీతాకు తెలిసింది. దీంతో ఆమె ఒక్కసారిగా అపరకాళిగా మారి చేతిలో గొడ్డలి పట్టుకుని పెళ్లి జరుగుతున్న మండపానికి చేరుకుంది. దీంతో పెళ్లికివచ్చిన వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. 
 
ఆ తర్వాత వధువుపై దాడికి యత్నించింది. ఆమె తృటిలో తప్పించుకోవడంతో, ఆ తర్వాత వెంటపడిమరీ పట్టుకుని చితక్కొట్టింది. ఆమె బారి నుంచి తప్పించుకున్న పూజ నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని మొరపెట్టుకుంది. సునీత నుంచి తనను కాపాడాల్సిందిగా వేడుకుంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments