Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమలో పడి పొరపాటు చేశాను.. మళ్లీ ఆ తప్పు చేయను: రెజీనా

నటిని కావాలనే కోరికతోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని.. పదేళ్ల కెరీర్‌లో ఎన్నో మలుపులు చూశానని చెప్పుకొచ్చింది రెజీనా. తెలుగు సినీ పరిశ్రమలో రెజీనా ఎంట్రీ ఇవ్వగానే భారీ ఆఫర్లను సొంతం చేసుకుంది. అయ

Advertiesment
Regina Cassandra
, మంగళవారం, 16 జనవరి 2018 (11:22 IST)
నటిని కావాలనే కోరికతోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని.. పదేళ్ల కెరీర్‌లో ఎన్నో మలుపులు చూశానని చెప్పుకొచ్చింది రెజీనా. తెలుగు సినీ పరిశ్రమలో రెజీనా ఎంట్రీ ఇవ్వగానే భారీ ఆఫర్లను సొంతం చేసుకుంది. అయితే హిట్ సినిమాలు మాత్రం ఆమె ఖాతాలో తక్కువే. సక్సెస్‌లు తక్కువ కావడంతో.. కెరీర్ పరంగా గ్రాఫ్ మాత్రం తగ్గుతోంది. ఇందుకు కారణం తాను ప్రేమలో పడటమేనని రెజీనా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 
 
పదేళ్ల కెరీర్‌లో ఎన్నో మలుపులు చూశాను. ప్రేమలో పడి పొరపాటు  కూడా చేశానని రెజీనా చెప్పింది. ఫలితంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయానని.. ప్రస్తుతం మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. సక్సెస్‌పై దృష్టి పెట్టానని ఆమె తెలిపింది. ప్రేమలో పడిన సమయంలో సినిమాల ఎంపికలో కొన్ని తప్పులు చేశాను. ఆ తప్పులను గుర్తించేసరికి సమయం మించిపోయింది. ఇక ఇప్పుడు ప్రేమా, పెళ్ళి జోలికి వెళ్ళదలుచుకోలేదు. మా ఇంట్లో కూడా అదే చెప్పేశాను. కొన్ని రోజుల వరకూ పెళ్లి మాటెత్తవద్దన్నాను. 
 
ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్‌ మీదే. తెలుగు, తమిళం ఏ భాషలోనైనా సరే మంచి విజయాన్ని అందుకోవాలని రెజీనా తెలిపింది. కాగా... తెలుగులో మెగా మేనల్లుడు 'సాయిధరమ్ తేజ్' తో నటించిన 'పిల్లా నువ్వులేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాలు తప్పా, 'రెజీనా' ఖాతాలో వేరే హిట్స్ లేవన్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''భరత్ అనే నేను'' ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా?