Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర బంధానికి అడ్డు.. భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన భార్య

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (11:14 IST)
వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సహకారంతో భర్తను కడతేర్చిందో భార్య. ఆపై సహజ మరణమంటూ నాటకమాడినా తప్పించుకోలేకపోయింది. పంజాగుట్ట పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. బీహార్‌ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్‌ జా ఉపాధి కోసం నగరానికి వచ్చి ఖైరతాబాద్‌ ఎంఎస్‌ మక్తా రాజ్‌నగర్‌లో భార్య కుష్బుదేవీ(32), పదేళ్లలోపున్న ఇద్దరు కుమారులతో ఉంటూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. 
 
2019లో ఖైరతాబాద్‌లో జ్యూస్‌ పాయింట్‌ను ప్రారంభించాడు. ఇందులో పనిచేసేందుకు లాల్‌ బాబు(35) అనే తన బంధువును నియమించాడు. ఈ క్రమంలో కుష్బుదేవికి లాల్‌బాబుకు సాన్నిహిత్యం పెరిగి వివాహేతర బంధానికి దారి తీసింది. ఆరు నెలల క్రితం అతడు తన భార్య మృతిచెందడంతో బిహార్‌ వెళ్లాడు. చాలాకాలం రాకపోవడంతో అతడ్ని జూస్‌ పాయింట్‌ నుంచి తొలగించాడు లక్ష్మణ్‌జా. తర్వాత వచ్చిన లాల్‌బాబు హోటల్‌లో పనికి చేరాడు. కుష్బుదేవితో నిత్యం ఫోన్‌లో మాట్లాడుతూ వివాహేతర బంధాన్ని కొనసాగించసాగాడు.
 
విషయం తెలుసుకున్న లక్ష్మణ్‌ హెచ్చరించినా వీరు ప్రవర్తన మార్చుకోలేదు. తమ బంధానికి భర్త అడ్డువస్తున్నాడని భావించిన కుష్బుదేవి అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈనెల 14న రాత్రి లక్ష్మణ్‌జా నిద్రిస్తున్న సమయంలో ప్రియుడ్ని ఇంటికి పిలిపించింది. భర్త ఛాతిపై కూర్చుని మెడకు చున్నీ బిగించగా లాల్‌బాబు కదలకుండా చేతులను పట్టుకోవడంతో అతను మరణించాడు. 
 
మరుసటిరోజు ఉదయం భర్త సోదరుడు బిహారి జాకు ఫోన్‌ చేసి విషయం చెప్పి సహజ మరణంగా నమ్మించేందుకు ప్రయత్నించింది. సోదరుడి మృతిపై అనుమానంతో బిహారి జా పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. పోస్టుమార్టం నివేదికలో మృతుని ఒంటిపై గాయాలు, బలంగా ఊపిరి ఆడకుండా చేసినట్టు తేలడంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments