Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను దుడ్డు కర్రతో కొట్టి చంపిన భార్య...

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (07:32 IST)
మూడు ముళ్ళు వేసినప్పటి నుంచి భర్త పెట్టే చిత్ర హింసలను భరించలేని ఆ మహిళ.. కాళికామాతలా మారిపోయింది. భర్త పెట్టే చిత్రహింసలను ఇక భరించలేనని భావించి.. దుడ్డుకర్రతో భర్తను చావబాదింది. దీంతో కట్టుకున్న భర్త చనిపోయాడు. 
 
చనిపోయిన వ్యక్తి ఓ నేవీ అధికారి కావడం గమనార్హం. ఈయన దక్షిణ గోవాలోని వాస్కో సబ్ జిల్లాలో ఉన్న నేవల్ బేస్‌లో ఐఎన్ఎస్ హన్స నౌకలో ఎయిర్‌క్రాఫ్ట్ విభాగంలో పని చేస్తున్నాడు. ఈయన పేరు కౌశలేంద్ర సింగ్. అతను తరచూ ఇంటికి తాగి వచ్చి భార్యను చితకబాదేవాడు. కొన్నేళ్ల పాటు కౌశలేంద్ర హింసను ఆమె భరించింది. 
 
శనివారం రాత్రి బాగా తాగి వచ్చిన కౌశలేంద్ర భార్యపై దాడి చేశాడు. దీంతో ఆమె ఇరుగు పొరుగు వారికి తన బాధను వెల్లడించింది. వారు వెళ్లగానే మరోమారు ఆమెపై కౌశలేంద్ర దాడికి తెగబడ్డాడు. ఇక సహించలేకపోయిన ఆమె అతను నిద్రలోకి జారుకోగానే దుడ్డుకర్రతో తలపై బలంగా మోదింది. 
 
గాయాలపాలైన కౌశలేంద్రను చూడగానే భయపడిపోయిన భార్య ఇరుగు పొరుగు సాయంతో నేవల్ ఆసుపత్రికి తరలించింది. అయితే అతడు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్థారించారు. పోలీసులకు సమాచారం చేరవేయగా కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments