Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం, అడ్డొస్తున్నాడని?

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (21:49 IST)
వివాహేతర సంబంధాలు ఎన్నో ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఒక సంఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది. భర్త స్నేహితుడితోనే అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య ఏకంగా భర్త హత్యకే స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయింది.
 
చెన్నైలోని షీనాయ్ నగర్ ప్రాంతానికి చెందిన సురేష్‌కు అదే ప్రాంతానికి చెందిన శరణ్యతో వివాహమైంది. వీరి పెళ్ళి జరిగి పదేళ్ళు అవుతోంది. కుమారుడు కూడా ఉన్నాడు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలో సురేష్ బాల్య స్నేహితుడు వినోద్ రాకతో మొత్తం మారిపోయింది.
 
శరణ్య అందాన్ని చూసిన వినోద్ ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. స్నేహితుడి భార్య ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్లో మాటలు కలిపాడు. మెల్లగా ఆమెకు కొన్ని గిఫ్ట్‌లు కొనిచ్చాడు. భర్త ఆటో డ్రైవర్ కావడంతో ఆమె అడిగినన్ని కొనిచ్చేవాడు కాదు.
 
కానీ వినోద్ మాత్రం అడిగిన దాన్ని కొనివ్వడంతో శరణ్య కూడా అతనికి దగ్గరైంది. స్నేహితురాళ్ళను కలిసి వస్తానని బయటకు వెళ్లే శరణ్య ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. శారీరకంగా ఇద్దరూ తరచూ కలిశారు. అయితే భార్య బయటకు వెళ్ళడంపై భర్తలో అనుమానం మొదలైంది.
 
ఆమె ఫోన్‌ను పరిశీలిస్తే వినోద్ నెంబర్లు కనిపించాయి. దీంతో కన్ఫామ్ చేసుకున్నాడు భర్త. భార్యను నిలదీశాడు. సురేష్‌తో ఇక ఉండలేనని నిర్ణయించుకున్న వినోద్ ఎలాగైనా అతడిని చంపేయాలని ప్లాన్ చేసింది. ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. నిన్న రాత్రి వినోద్ తన ముగ్గురు స్నేహితులను వెంట పెట్టుకుని సురేష్ పైన కత్తులతో దాడికి పాల్పడ్డాడు. 
 
సురేష్ అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యే తనపై హత్యాయత్నం చేయించిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments