Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు ముందు అరటిపండు తింటూ నిల్చున్న బాలిక.. సారీ చెప్పిన ఆడి

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (20:51 IST)
Audi insensitive ad girl
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఆడి ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటోంది. కారణం ఓ ప్రకటన. ఆడి కారు ముందు ఓ పాప అరటిపండు తింటూ కనిపించడం వివాదానికి తావిచ్చింది. ఈ వివాదంపై ఆడి సంస్థ క్షమాపణలు కూడా చెప్పేసింది. వివరాల్లోకి వెళితే.. ఆడి సంస్థ ఆడీ ఆర్ఎస్ 4 అవాంట్ అనే కొత్త ఎడిషన్ కారును మార్కెట్లోకి తీసుకొస్తోంది. 
 
ఇందులో భాగంగా ప్రమోషన్ కోసం సంస్థ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఆడి కారు ముందు చిన్న పాప అరటిపండు తింటూ నిల్చుంది. కారు ముందు అరటిపండు తింటూ పాప కనిపించడంతో.. ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారిపోయింది. పైగా 'ప్రతి అంశంలోనూ మీ గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది' అంటూ ఈ కారు ఫొటోకు క్యాప్షన్ రాసుకొచ్చారు. 
 
ఈ ఫొటో లైంగికంగా, శృంగార ప్రేరితంగా అనిపిస్తోందంటూ విమర్శకులు, నెటిజన్లు మండిపడ్డారు. దీంతో తప్పు జరిగిపోయిందంటూ ఆడి సంస్థ ట్విటర్‌లో క్షమాపణలు చెప్పుకొచ్చింది. పిల్లల విషయంతో తాము జాగ్రత్త వహిస్తామని వివరణ ఇచ్చింది. ఈ యాడ్‌పై దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించింది. ఇలాంటి ఫోటోలను భవిష్యత్తులో వాడేది లేదని హామీ ఇచ్చింది. 
 
కానీ ఆడి యాడ్‌లో తప్పేముందని వాదించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. సమస్య యాడ్‌లో లేదని.. చూస్తున్న మనుషుల మెదడులోనే ఏదో సమస్య ఉందంటూ కొందరు నెటిజన్లు రీట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం