Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కావాలనే భర్తను హత్య చేయలేదు.. ఏదో అనుకోకుండా జరిగిపోయింది..?

కావాలనే భర్తను హత్య చేయలేదు.. ఏదో అనుకోకుండా జరిగిపోయింది..?
, సోమవారం, 3 ఆగస్టు 2020 (22:18 IST)
క్షణికావేశం, మానవీయ విలువలు మంటగలిసిపోవడంతో... నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. కుటుంబంలోనే ఏర్పడే గొడవలు హత్యలకు దారితీస్తున్నాయి. ఇలా ఓ భర్తను చంపిన భార్య.. ఏదో క్షణికావేశంలో కత్తితో పొడిచానని.. కావాలనే అలా చేయలేదని చెప్పడంతో ఉరిశిక్ష నుంచి తప్పించుకుంది. ఈ ఘటన మలేషియాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మలేషియాలో సమంతా జోన్స్(51) అనే మహిళ 2018 అక్టోబర్ 18వ తేదీన తన భర్తను కత్తితో పొడిచి హతమార్చింది. ఆ తరువాత ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు కోర్టుకు వెళ్లింది. ఈ కేసుపై అప్పటి నుంచి తుది తీర్పు రాకపోవడంతో.. 20 నెలల నుంచి సమంతా జోన్స్ జైలుశిక్షను అనుభవిస్తోంది. 
 
సహజంగా హత్యకు సంబంధించిన కేసులో సమంతా జోన్స్‌కు ఉరిశిక్ష విధించాల్సి ఉంది. అయితే సమంతా జోన్స్ నేరాన్ని అంగీకరిస్తూనే.. తన భర్తను కావాలని హతమార్చలేదని కోర్టుకు చెప్పుకొచ్చింది. ఆమె తరపు లాయర్ కూడా కోర్టుకు ఇదే చెబుతూ వచ్చారు. 
 
తాను నేరం చేశానని.. అయితే అది అనుకోకుండా జరిగిన సంఘటన అని సమంతా జోన్స్ జడ్జికి వివరించింది. తన భర్త అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఆ రోజు తామిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో అనుకోకుండా తాను భర్తను హతమార్చాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
తన భర్త చాలా కాలం నుంచి తనను వేధిస్తూ వచ్చాడని.. తన భర్తను ఎన్నో థెరపీలకు కూడా పంపినా ప్రయోజనం లేకపోయిందని చెప్పుకొచ్చింది. తన భర్త ఎంతో కోపంతో తనపై దాడికి దిగేవాడని.. హత్య జరిగిన రోజు కూడా తనపై ఎంతో కోపంతో ఉన్నాడని వివరించింది.
 
ఇక సమంతా జోన్స్ వాదనలను విన్న జడ్జి ఆమెకు ఉరిశిక్ష విధించడం లేదని.. 42 నెలల జైలుశిక్ష విధిస్తున్నట్టు తీర్పునిచ్చారు. పైగా ఆమె జైలులో మంచి ప్రవర్తనతో కలిగి ఉండటంతో.. ఆమె జైలుశిక్ష కూడా తగ్గే ఛాన్స్ వున్నట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీకి మూడు రాజధానులు.. హైకోర్టును ఆశ్రయించిన అమరావతి రైతులు