Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువతితో సహజీవనం, పెళ్లనగా నాకు ఆల్రెడీ పెళ్లాం వుందన్న ప్రియుడు

యువతితో సహజీవనం, పెళ్లనగా నాకు ఆల్రెడీ పెళ్లాం వుందన్న ప్రియుడు
, సోమవారం, 3 ఆగస్టు 2020 (15:18 IST)
ఫేస్‌బుక్‌‌లో పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరూ కొంతకాలం సహజీవనం చేశారు. తీరా యువతి పెళ్లి చేసుకోమనగానే సదరు యువకుడు తనకు ఇంతకుమునేపే పెళ్లి జరిగిందని యువతితో చెప్పడంతో ఖంగుతిన్న సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది.
 
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్  ఎయిర్‌పోర్ట్ అధారిటీ పోలీస్ సీఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాలు ప్రకారం... నగరంలోని కుషాయిగూడ చక్రిపురం కాలనీకి చెందిన యువతి(23) డ్యాన్సర్‌‌గా పనిచేస్తోంది. అదే మండలంలోని బహదూర్‌గూడకు చెందిన రాజ్‌కుమార్‌ (25) ఇద్దరకీ  ఏడాదిన్నర కిందటే ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఎనిమిది నెలల కిందట ఆర్‌బీనగర్‌లో భార్యభర్తలుగా చెప్పుకుంటూ అద్దె గదిలో నివాసముంటూ సహజీవనం చేశారు.
 
ఇటీవల ఇద్దరి మధ్యన మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. యువతి తనను వివాహం చేసుకోవాల్సిందిగా రాజ్‌కుమార్‌ను కోరడంతో తనకు అప్పటికే పెళ్లి జరిగిందని తేల్చి చెప్పడంతో పాటు సదరు యువతిని పెళ్లి చేసుకోనని చెప్పడంతో మోసపోయినట్లుగా గుర్తించిన యువతి ఆదివారం ఆర్‌జీఐఏ పోలీసులను ఆశ్రయించింది. తనను నమ్మించి మోసం చేశాడని వాపోయింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరకట్నం అదనంగా తెమ్మన్నాడు.. కాదంటే స్నేహితులతో సరసాలాడమన్నాడు..