Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరకట్నం అదనంగా తెమ్మన్నాడు.. కాదంటే స్నేహితులతో సరసాలాడమన్నాడు..

Advertiesment
వరకట్నం అదనంగా తెమ్మన్నాడు.. కాదంటే స్నేహితులతో సరసాలాడమన్నాడు..
, సోమవారం, 3 ఆగస్టు 2020 (14:37 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. భర్త తన భార్యను వరకట్న వేధింపులకు గురిచేయడంతో పాటు అతడి స్నేహితులతో కూడా సరసాలాడాలని బలవంతం చేసినట్లు ఓ మహిళ వాపోయింది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  అహ్మదాబాద్‌కు చెందిన అనుపమ, పార్థ్‌ దంపతులకు 2002లో వివాహమైంది. 
 
తాను ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ అని, సొంతంగా టెక్స్‌టైల్‌ మిల్లు ఉందని అనుపమ తల్లిండ్రులను పార్థ్‌ కుటుంబ సభ్యులు నమ్మించారు. మంచి కుటుంబం అనుకుని అనుపమ కుటుంబ సభ్యులు కట్నం కింద 50 తులాల బంగారం ఇచ్చారు. ఆరు నెలల తర్వాత ఆమెకు అత్తింటి వారు వేధించడం మొదలుపెట్టారు. మరింత కట్నం తీసుకురావాలని వేధించే వాడు. చితకబాదేవాడు. మొత్తానికి 2005లో పండంటి మగబిడ్డకు అనుపమ జన్మనిచ్చింది. అయితే పార్థ్‌ ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ కూడా కాదని ఆమెకు తెలిసిపోయింది.
 
ట్రావెల్‌ ఏజెన్సీ నడుపుతున్న పార్థ్‌కు తన బిజినెస్‌లో భారీగా నష్టం వచ్చింది. దీంతో తాగుడుకు అతను బానిస అయ్యాడు. మద్యం మత్తులో ఉన్న సమయంలో తన స్నేహితులతో కూడా సరసలాడాలని భార్యను వేధించేవాడు‌. తాను కూడా వారి భార్యలతో సరసలాడుతానని అనుపమను హింసించేవాడు. మొత్తానికి ఈ క్రమంలో ఆమెకు వేధింపులు ఎక్కువ అయ్యాయి. దీంతో భర్తతో పాటు అత్తమామలు, ఆడపడుచులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోడ్డు పక్కన కూర్చొని కూరగాయలు అమ్ముకుంటే.. నెమలికి..?