Webdunia - Bharat's app for daily news and videos

Install App

పతి ఆరోగ్యం కోసం రోజూ లడ్డూ తినిపించిన భార్య... విడాకుల కోసం కోర్టుకెక్కిన భర్త

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (18:09 IST)
భర్త ఆరోగ్యం బాగుండాలని భార్య ప్రతి రోజూ ఓ లడ్డూ తినిపించింది. అయితే, రోజూ లడ్డూలను ఆరగించడం ఇష్టంలేని భర్త.. తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ కోర్టుకెక్కారు. ఈ విచిత్ర కేసు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ మీరట్‌కు చెందిన ఓ జంటకు పదేళ్ళ క్రితం వివాహమైంది. అయితే కొంత కాలంగా భర్త అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. అతడి పరిస్థితి చూసి చలించిపోయిన భార్య.. ఓ తాంత్రికుడిని ఆశ్రయించింది. తన భర్త ఆరోగ్యం బాగుచేయాలని తాంత్రికుడి వద్ద మొరపెట్టుకుంది. ఆమెకు అభయహస్తమిచ్చిన తాంత్రికుడు.. ప్రతిరోజూ, రెండుపూటలా భర్తకు లడ్డూలు తినిపిస్తే అతడు తిరిగి ఆరోగ్యవంతుడవుతాడని సెలవిచ్చాడు.
 
అంతే.. ఆ మాంత్రికుడి బోధను ఆమె ఓ దివ్యోపదేశంగా భావించి, ఆచరణలో పెట్టింది. ప్రతి రోజూ రెండూ లడ్డూలు తినిపించసాగింది. కొద్ది రోజులకు లడ్డూలపై అతనికి విరక్తి పుట్టింది. అయినా భార్య మాత్రం వదిలిపెట్టలేదు. లడ్డూలు తినాల్సిందేనంటూ భార్య పెట్టే బాధలను తట్టుకోలేక కొన్ని సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చాడు. 
 
భార్య మాత్రం ఒక్క మెట్టుకూడా దిగలేదుకదా.. మీ ఆరోగ్యం కోసమే ఇదంతా అంటూ.. మరింత కఠినంగా తాంత్రికుడి సలహాను పాటించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో... నాకు విడాకులింప్పిచండి అంటూ మహాప్రభో అంటూ ఆ దీనుడు కోర్టును వేడుకున్నారు. భర్త చెప్పిన కారణం విని మొదట వారు కూడా షాకయ్యరు. అయితే.. ఓ జంట విడిపోవడం చూడలేని వారు, దంపతులని కౌన్సెలింగ్‌కు పిలిపించారు. 
 
విచిత్రమేంటంటే.. కాపురం కూలిపోయే స్థితికి వచ్చినా కూడా ఆమె వెనక్కుతగ్గలేదు. 'లడ్డూయే సర్వరోగ నివారిణి, అదే తన భర్తను ఆరోగ్యవంతుణ్ణి చేస్తుంది.' అని ఆ అభినవసావిత్రి తేల్చిచెప్పడంతో వారు తలలు పట్టుకున్నారు. దీంతో ఆమెకు షాకివ్వాలని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

హృదయాలను హత్తుకునేలా గాంధీ తాత చెట్టు - రివ్యూ

నాకు వేల కోట్ల క్లబ్ వద్దు - దేవుడిచ్చింది చాలు : వెంకటేష్

తిరుపతిలో సెటిల్ అవుతా, గోవిందా... గోవిందా నామస్మరణతో నిద్రలేస్తా: జాన్వీ కపూర్

సంక్రాంతికి వస్తున్నాం.. జబర్దస్త్ స్కిట్టా? దర్శకుడు అనిల్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

తర్వాతి కథనం
Show comments