Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెవులు మెలేశాడు.. కొరికాడు.. కొట్టాడు.. వీడూ ట్యూషన్ టీచరేనా?

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (11:27 IST)
ఇటీవలి కాలంలో ముక్కుపచ్చలారని పసిపిల్లలు చిత్ర హింసలకు గురవుతున్నారు. ముఖ్యంగా, పాఠశాలలకు వెళ్లే చిన్నారుల పట్ల టీచర్లు అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. సరిగ్గా చదవలేదనో, హోంవర్క్ పూర్తి చేయలేదనో, ఫీజు కట్టలేదనో, తరగతి గదిలో అల్లరి చేస్తున్నాడనో ఇలా ఏదో ఒక కారణంతో చిన్నారుల పట్ల అత్యంత టీచర్లు అతిక్రూరంగా నడుచుకుంటున్నారు. 
 
తాజాగా ఏడేళ్ళ విద్యార్థిపై ఓ ఉపాధ్యాయుడు వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. అతను పెట్టిన చిత్రహింసలు మొత్తం సీసీ టీవీలో రికార్డు అయింది. ఈ ఘటన ఆలీగఢ్‌లో జరిగింది. ఓ టీచర్ ఇంటికి వెళ్లి ట్యూషన్ చెబుతుంటాడు. అలా ఆలీగఢ్‌లోని ఓ ఇంటికి ప్రతి రోజూ ట్యూషన్‌కు వెళ్లే టీచర్.. ఆ ఇంటి బాలుడుని ఓ కుర్చీలో కూర్చోబెట్టాడు. బాలుడుని నానా రకాలుగా హింసించాడు.
 
బాలుడు జుట్టు పట్టుకున్నాడు. చెవులు మెలేశాడు. కొరికాడు... కొట్టాడు. అదీ కూడా చెప్పుతీసుకుని. వేళ్లను సైతం కొరకడంతో ఆ బాలుడు కెవ్వున కేక పెట్టినా ఏమాత్రం కనికరం చూపలేదు. ఓ గ్లాసుడు మంచినీళ్లిచ్చి నవ్వించే ప్రయత్నం చేశాడు. టీచర్ చేసిన పనిని చూసిన ఆ తండ్రి ఆగ్రహతో ఊగిపోతూ, పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు.. టీచర్‌ను అరెస్టు చేసి హత్యాయత్న కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments