Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీతమ్మలా అగ్నిపరీక్ష.. చేతులు కాలిపోవడంతో వ్యభిచారం చేశావంటూ..?

Advertiesment
Mother-in-Law
, శుక్రవారం, 26 అక్టోబరు 2018 (14:50 IST)
కోడలిపై అత్త దాష్టీకం ప్రదర్శించింది. రామాయణంలో సీతమ్మ తరహాలో కోడలికి అగ్నిపరీక్ష పెట్టింది. వ్యభిచారం చేస్తోందని ఆరోపిస్తూ.. నిజాయితీని నిరూపించుకోమంటూ.. చేతులను నిప్పుతో కాల్చేసింది. దీంతో ఆ కోడలి చేతులు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురకి చెందిన సుమని అనే యువతికి గతేడాది ఏప్రిల్‌లో అదే ప్రాంతానికి చెందిన జైవీర్‌తో వివాహమైంది. అదే రోజు సుమని చెల్లికి.. జైవీర్ సోదరుడు యష్ వీర్ కూడా వివాహమైంది. పెళ్లి జరిగిన ఆరునెలలపాటు అంతా సవ్యంగానే సాగింది. ఆ తర్వాత నుంచే సుమనికి అత్తారింట్లో కష్టాలు మొదలయ్యాయి. 
 
ఆ తర్వాతే అసలు సంగతి మొదలైంది. కట్నం కోసం వేధింపులకు గురిచేశారు. ఆఖరికి వ్యభిచారం చేస్తున్నావంటూ ఆరోపించడం మొదలుపెట్టారు. కట్టుకున్న భర్త కూడా తనను మోసం చేస్తున్నావంటూ హింసించడం మొదలుపెట్టాడు. తాను ఎలాంటి తప్పుచేయలేదని వేడుకున్నా వారు అంగీకరించలేదు. 
 
ఇటీవల వ్యభిచారం చేయడం లేదని నిరూపించుకోవడానికి ఆ వివాహితకు అగ్నిపరీక్ష పెట్టారు. ఆమె చేతులను నిప్పుల్లో పెట్టి.. ఏ తప్పుచేయకపోతే.. చేతులు కాలవని తేల్చారు. కాగా.. ఆమె చేతులు కాలడంతో తప్పు చేశావంటూ మళ్లీ ఆరోపించడం మొదలుపెట్టారు. దీంతో.. బాధితురాలు తన తండ్రి సహాయంతో పోలీసులను ఆశ్రయించగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరెడ్డి ట్వీట్ మిస్‌ ఫైర్.. బుర్రతక్కువదానా అంటూ నెటిజన్ల ఫైర్