Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీరెడ్డి ట్వీట్ మిస్‌ ఫైర్.. బుర్రతక్కువదానా అంటూ నెటిజన్ల ఫైర్

Advertiesment
Sri Reddy
, శుక్రవారం, 26 అక్టోబరు 2018 (14:33 IST)
పలువురు సినీ సెలెబ్రిటీలపై లైంగిక వేధింపు ఆరోపణలు చేసి మంచి పబ్లిసిటీ కొట్టేసిన నటి శ్రీరెడ్డి. ఈమె అపుడపుడూ రాష్ట్రంలో జరిగే కొన్ని సంఘటనలపై ట్వీట్ చేస్తుంటారు. తాజాగా వైజాగ్ ఎయిర్‌పోర్టులో జగన్‌పై జరిగిన దాడిపై ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్తా మిస్ ఫైర్ అయింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
'మా జగన్ అన్నకి ఏం అయ్యింది. రాష్ట్రం కోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టి అహర్నిశలు శ్రమిస్తున్న వైఎస్ జగన్ గారి మీద ప్రతిపక్షాల దాడులు ఏంటి. దమ్ముంటే దైర్యంగా ఎదుర్కోవాలి అంతేగాని జనం కోసం పోరాడుతున్న జగన్ గారి మీద ఇలా చేయటం తప్పు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా జగన్ అన్నా' అని శ్రీరెడ్డి ట్వీట్‌లో పేర్కొంది. 
 
ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కారణం తన ట్వీట్‌లో శ్రీరెడ్డి ప్రతిపక్షాల దాడి అని పేర్కొనడమే. 'ప్రతిపక్షాల దాడి ఏంటి? జగన్ ప్రతిపక్షమే.. టీడీపీ వాళ్లు డబ్బులిచ్చి ప్రతిపక్షాలు అని అనమన్నారా? బుర్రతక్కువదానా' అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ దాడిపై శ్రీరెడ్డి స్పందన.. బుర్ర తక్కువదానా అంటూ నెటిజన్లు ఫైర్