Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కానిస్టేబుల్ కొడుకు ఎందుకు ముఖ్య‌మంత్రి కాలేడు.. అవుతాడు... పవ‌న్ క‌ళ్యాణ్

కానిస్టేబుల్ కొడుకు ఎందుకు ముఖ్య‌మంత్రి కాలేడు.. అవుతాడు... పవ‌న్ క‌ళ్యాణ్
, మంగళవారం, 16 అక్టోబరు 2018 (14:23 IST)
జనసేన కవాతులో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతిలు ఎందుకివ్వడం లేదు అని ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ప్రత్యేక విమానాలు వేసుకుని విదేశాలకు వెళ్తారు. ఎన్ని పరిశ్రమలొచ్చాయ్.. ఎన్ని ఉద్యోగాలొచ్చాయ్.. అని అడుగుతున్నా. అమెరికా న్యూయార్క్ వీధి దుకాణం వాడిని లైసెన్సు ఎలా అని అడిగా. పోలీసులు బెదిరిస్తారా అని అడిగా.. తాను మూడు సంవత్సరాలకు ఒకసారి.. 300 డాలర్లు కడతా.. ఇక ఎవరూ ఇబ్బంది పెట్టరు అని చెప్పాడు. 
 
అలాంటి పారదర్శక వ్యవస్థ మనకెందుకు లేదు. మన దగ్గర  చిన్న కూరగాయలు అమ్ముకునే బండ్లను కానీ, అసంఘటిత కార్మికులు తోపుడుబళ్లు, ఇడ్లీ బండ్లు, వాళ్లకు ట్రాఫిక్ రెవెన్యూ వారి నుంచి  ఇబ్బందుల్లేకుండా సింగిల్ విండో సిస్టమ్ పెట్టలేకపోయారు. విదేశాలకు వెళ్లడం కాదు.. మన సగటు మనుషుల కష్టాలను తీర్చాలనే ప్రయత్నం జరగాలి. అందుకే జనసేన అధికారంలోకి వస్తే.. అసంఘటిత కార్మికులకు చిన్న కార్మికులకు వ్యాపారులకు అండగా ఉంటాను అని మాట ఇస్తున్నా. 
 
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి కూడా చెప్పాలి. మా ముత్తాత ఓ చిన్న మునసబు. మా తాత ఓ చిన్న పోస్ట్ మేన్. నా తండ్రి కానిస్టేబుల్. నా మూలాలు మీకు తెలియాలి కనుక చెబుతున్నా. మా తాత సీఎం కనుక నేను సీఎం అవుతా అని మీరు అనుకుంటే.. మా నాన్న సీఎం అయ్యాడు గనుక నేను అవుతా అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే అది చెల్లదు. మున్సబు ముని మనవడు, పోస్ట్ మేన్ మనవడు, కానిస్టేబుల్ కొడుకు కూడా  ఖచ్చితంగా సీఎం అవుతాడు. మీరేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా... మేం జాతిని గౌరవంచే వాళ్లం, అవమానాలు దిగమింగుతాం, భరిస్తాం.. సహిస్తాం.. అవమానాలు ఎక్కువైతే తాటతీస్తాం.. ఎందుకీ మాట అంటున్నానంటే. పవన్ వద్ద వేలకోట్లు లేవు. మా తాతలు జమీందార్లు కారు.. వ్యాపారాలు చేసిన వాళ్లు కాదు. సంపన్నులు కాదు. అయినా జనాదరణ మాకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బరితెగించిన ఎమ్మెల్యే తమ్ముడు... పిస్టల్‌తో యువజంటకు బెదిరింపులు