Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోడిది తప్పేలేదు.. ఆమె ఊఁ అంది... మా క్లెయింట్ తృప్తిపరిచాడు..

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (17:38 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువతి కోరిక మేరకు ఆ యువతితో శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తికి కోర్టు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో ఆ నిందితుడి తరపు న్యాయవాది కోర్టులో సరికొత్త వాదన తెరపైకి తెచ్చాడు. ఆ అమ్మాయి మేజర్.. ఆమె ఇష్టంతోనే నా క్లయింటే ఆమెతో సెక్స్‌లో పాల్గొన్నాడు. ఆమె సమ్మతం తెలపడం వల్లే శారీరకంగా కలిసి ఆమెను తృప్తి పరిచాడంటూ చెప్పారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్‌కు నిందితుడు తరపు న్యాయవాది చెప్పారు దీనికి హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు ఎవరూ సరదా కోసం శారీరక సంబంధాలు పెట్టుకోరంటూ చురకలంటించారు. 
 
తాజా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఎంపీలోని ఉజ్జయినికి చెందిన యువకుడు పెళ్లి పేరుతో ఓ యువతితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే అనంతరం అతడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వివాదం మొదలైంది. ఈ తతంగం 2018లో జరిగింది.
 
అయితే శారీరక సంబంధం పెట్టుకున్న యువతి, యువకుడు వేర్వేరు మతాలకు చెందినవాళ్లు. తమ ఇంట్లో పెద్దవాళ్లు ప్రేమకు ఒప్పుకోవడంలేదని, అందుకే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని ఆ యువకుడు చెప్పడంతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొంది ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించి, యువకుడిపై అత్యాచార కేసు నమోదు చేశారు. యువకుడు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా.. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ ఈ కేసును విచారించింది.
 
ఆ అమ్మాయి మేజర్ అని, ఆమె ఇష్టంతోనే తన క్లయింటు శారీరక సంబంధం పెట్టుకున్నాడని యువకుడి తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఇండోర్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ సుబోధ్ అభయంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
అమ్మాయిలు ఎవరూ సరదా కోసం శారీరక సంబంధాలు పెట్టుకోరని స్పష్టం చేశారు. సంప్రదాయాలకు విలువ ఇచ్చే మన సమాజంలో అవివాహిత యువతులు ఇంత దిగజారే స్థితికి ఇంకా చేరుకోలేదని జస్టిస్ సుబోధ్ వ్యాఖ్యానించారు.
 
పెళ్లి చేసుకుంటామనే బలమైన హామీపైన తప్పించి, ఇతరత్రా కారణాలతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం వారికేమీ సరదా కాదని పేర్కొన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో తమ నిజాయతీ నిరూపించుకోవడానికి బాధితులు బలవన్మరణాలకు ప్రయత్నించాల్సిన అవసరంలేదన్నారు.
 
అంతేకాకుండా శారీరక సంబంధాల పర్యవసానాలను కూడా పురుషులు దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికారు. కాగా నిందితుడికి బెయిల్ నిరాకరిస్తున్నట్టు జస్టిస్ సుబోధ్ అభయంకర్ స్పష్టం చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం