Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూడో క‌న్నుగా పిలిచే... ఫోటోగ్ర‌ఫీకి 182 వసంతాలు!

Advertiesment
మూడో క‌న్నుగా పిలిచే... ఫోటోగ్ర‌ఫీకి 182 వసంతాలు!
విజయవాడ , గురువారం, 19 ఆగస్టు 2021 (16:29 IST)
క‌మాన్ రెడీ, స్ట‌డీ, స్మైల్... క్లిక్!

ఇదీ, ఫోటో తీసేట‌పుడు ఫోటోగ్రాఫ‌ర్ ప‌లికే మాట‌లు.

మూడో క‌న్నుగా పిలిచే ఫోటోగ్ర‌ఫీకి నేటికి 182 వ‌సంతాలు నిండాయి.

1839వ సంవత్సరంలో ఫొటోగ్రఫీ ఆవిష్కరణ జరిగింది. తరువాత క్రమంగా ప్రపంచ దేశాలు అన్నిటిలోకి ఈ ప్రక్రియ వ్యాపించటం మొద లైంది. ఇదే క్రమంలో మన దేశంలోకి కూడా ఫొటోగ్రఫీ ప్రవేశించింది. ఆధారాలని బట్టి సుమారు 1840లోనే మన దేశంలోకి ప్రవేశించినట్లు దాఖలాలు ఉన్నాయి.

ఆ రోజుల్లో మొట్ట మొదటి వ్యాపార సంస్థను ఎఫ్‌. స్వ్రాన్‌హోపర్‌ అనే కమర్షియల్‌ ఫొటోగ్రాఫరు ప్రారంభించాడు. కలకత్తాలో కేలోటైపు ఫొటోగ్రఫీ ప్రక్రియతో ఒక స్టూడియోను ప్రారంభించినట్లుగా ఋజువులున్నాయి. ఇదే భారతదేశంలో మొట్టమొదటి స్టూడియో. యజమాన్యాలు ఎన్నిమారినా ఆ స్టూడియో ఇప్పటికి నెంబ‌ర్ 8, చౌరంగీ రోడ్డు, కలకత్తాలో నిల్చి ఉంది. ఆ రోజుల్లోనే 1853లో రాయల్‌ ఫొటో గ్రాఫిక్‌ సొసైటీని ఇంగ్లాండులో స్థాపించారు.

1854లో ఫొటో గ్రాఫిక్‌ సొసైటీ ఆఫ్‌ బాంబే స్థాపించబడింది. మన దేశంలో ఇది మొట్టమొదటి ఫొటో క్లబ్బు. ఆ తర్వాత ఇది ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్‌ ఇండియాగా మార్పు చెందింది. ఇది ఇప్పటికీ ఫొటోగ్రఫీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 1855లో ఈ క్లబ్బు మొట్ట మొదట ఫొటో ప్రదర్శనని ఏర్పాటు చేసింది. నేడు ఫోటోగ్ర‌ఫీ దినోత్స‌వం సంద‌ర్భంగా ఫోటోగ్రాఫ‌ర్లకు అభినంద‌న‌లు తెలుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27 మంది బీసీల‌ను కేంద్ర మంత్రుల్ని చేస్తే... వాళ్ళు అవ‌మానించారు!