కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే రేషన్ కార్డుదారులకు ఈ -కె వై సి నమోదు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ కోన శశిధర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 10 శాతం మంది ఈ-కె వై సి నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు.
ఈ-కెవైసి పేరుతో రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తమన్నారు. ప్రతి ఒక్కరు ఆధార్ డేటాతో ఈ- కె వై సి చేయించుకోవాలని, ఈ-కె వైసీ చేసుకుంటే, ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రమైన రేషన్ తీసుకోవచ్చని శ్రీధర్ తెలిపారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు సెప్టెంబర్ నెలాఖరు వరకు నమోదు చేస్తామని, గ్రామ వాలంటీర్ ద్వారా ఈ - కె వై సి చేసుకోవచ్చన్నారు.
అసలు ఆధార్ లో డేటా లేని వాళ్ళు మాత్రమే, ఆధార్ కేంద్రాలకు వెళ్లి చేసుకోవాలన్నారు. కోవిడ్ నియమాలు పాటిస్తూ, ఈ కె వైసీ చేసుకునేలా చర్యలు చేపట్టామని పౌర సరఫరాల శాఖ ఎక్స్ ఆఫీసియో సెక్రటరీ తెలిపారు.