Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమతా బెనర్జీకి మరో షాక్.. సీనియర్ ఎంపీ ద్వివేదీ రాజీనామా

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (18:17 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు అధికార పార్టీకి దెబ్బపై దెబ్బ పడుతోంది. ఇప్పటికే ఒకరిద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. తాజాగా ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ గుడ్‌బై చెప్పారు. 
 
టీఎంసీకి చెందిన సీనియర్ ఎంపీ దినేశ్‌ త్రివేది తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఆయన సభలో మాట్లాడుతూ తన రాజీనామాను ప్రకటించారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసను అరికట్టేందుకు తానేమీ చేయలేకపోతున్నానని, అందుకే పదవి నుంచి వైదొలుగుతున్నట్లు త్రివేది తెలిపారు.
 
'బెంగాల్‌లో జరుగుతున్న హింస ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. దాని గురించి ఇక్కడేం మాట్లాడట్లేదు. హింసను అరికట్టేలా నేనేమీ చేయలేకపోతున్నందుకు నాకు చాలా ఇబ్బందిగా, బాధగా ఉంది. నన్ను ఇక్కడికి పంపించినందుకు మా పార్టీకి నేను కృతజ్ఞతగా ఉంటాను. కానీ అక్కడ దాడులు జరుగుతుంటే నేను మౌనంగా కూర్చోలేను. ఏం చేయలేని నువ్వు ఇక్కడ ఎందుకు? అని నా అంతరాత్మ ప్రశ్నిస్తోంది. అందుకే రాజీనామా చేస్తున్నా' అని త్రివేది సభలో ప్రకటించారు. 
 
అయితే రాజీనామాకు ప్రక్రియ ఉంటుందని, దీనిపై ఛైర్మన్‌కు లేఖ రాయాలని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ సూచించారు. అనంతరం త్రివేది తన రాజీనామా లేఖను ఛైర్మన్‌ వెంకయ్యనాయుడికి అందించారు. త్రివేది నిర్ణయం తృణమూల్‌ పార్టీని షాక్‌కు గురిచేసింది. ఆయన పదవి నుంచి తప్పుకోవడం బాధాకరమని టీఎంసీ ఎంపీలు వ్యాఖ్యానించారు.
 
మరోవైపు, దినేశ్ త్రివేది కూడా భాజపాలో చేరే అవకాశమున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓవైపు భాజపాపై బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న వేళ.. త్రివేది గురువారం తన ట్విటర్‌ ఖాతాలో ప్రధాని పసంగంపై ప్రశంసలు కురిపించారు. దీంతో ఆయన త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకునే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రదర్శించబడుతుందని ఎప్పుడూ ఊహించలేదు : రానా దగ్గుబాటి

పోసాని క్షమార్హులు కాదు... ఆయనది పగటి వేషం : నిర్మాత ఎస్కేఎన్

తండేల్ నుంచి నాగ చైతన్య, సాయి పల్లవిల బుజ్జి తల్లి రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments