Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీత పరిస్థితి హత్రాస్ ఘటనలా ఉండేది...: టీఎంసీ ఎంపీ

Advertiesment
TMC MP Kalyan Banerjee
, సోమవారం, 11 జనవరి 2021 (08:36 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీతాదేవిని రావణాసురుడు కాకుండా ఆయన అనుచరులు కిడ్నాప్ చేసివుంటే.. హత్రాస్ ఘటనలా ఉండేదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు కలకలం రేపుతున్నాయి. 
 
తాజాగా ఆయన పురాణ పాత్ర సీతాదేవిపై స్పందించారు. సీతాదేవిని రావణాసురుడు అపహరించాడు కాబట్టి సరిపోయిందని, అదే అతడి అనుచరులు కనుక ఆ పనిచేసి ఉంటే తన పరిస్థితి హత్రాస్ ఘటనలా తయారయ్యేదన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పైగా, కల్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలపై హౌరాలోని గోల్‌బారీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. 
 
రామాయణ, మహాభారతాలను అవమానించిన కల్యాణ్ బెనర్జీ రానున్న ఎన్నికల్లో ప్రతిఫలం అందుకోక తప్పదని బీజేపీ నేత లాకెట్ చటర్జీ హెచ్చరించారు. ఓ మహిళ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. 
 
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ కంటే బెంగాల్‌లోనే ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీతాదేవిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు కల్యాణ్ బెనర్జీ వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేత ఆశిష్ జయపాల్ డిమాండ్ చేశారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలకలం: భారత్‌లోకి చైనా సైనికుడు