Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన 43 రోజులకే భార్యను చంపేశాడా.. ఆత్మహత్య కూడా..?

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (09:01 IST)
భార్యాభర్తల అనుబంధం, ఆప్యాయతలు కనుమరుగవుతున్నాయి. అక్రమ సంబంధాల కోసం చేసే నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా పెళ్లైన 43 రోజులకే ఓ భర్త తన భార్యను గొంతు కోసి హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన తమిళనాడులోని సేలం జిల్లా వీరాణం ఒరత్తరు పట్టిలో చోటుచేసుకుంది. విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న వీరానం పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టానికి తరలించారు. 
 
పోలీసుల విచారణలో గత నెల 24వ తేదీన మోనీషా మేనత్త కుమారుడు మోనీషా పుట్టినరోజు సందర్భంగా కేక్‌ ఇవ్వడానికి వచ్చివెళ్లాడు. దీంతో తంగరాజ్‌ భార్య మీద అనుమానంతో వేధించడం మొదలెట్టాడు. ఆ అనుమానంతోనే భ్యార మోనీషాను తుంగరాజ్ గొంతు కోసి హతమార్చి ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. భార్యను చంపిన తర్వాత తంగరాజ్‌ విషం తాగి, ఆ తర్వాత ఉరి వేసుకున్నట్టు విచారణలో వెలుగు చూసిందని పోలీసులు పేర్కొన్నారు. 
 
ఒరత్తరు పట్టికి చెందిన తంగరాజ్‌(33) కు మోనీషా(19)తో ఫిబ్రవరిలో వివాహమైంది. కేవలం 43రోజుల్లోనే తంగరాజ్‌ భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments