Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ రిప్లై: పది రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (20:17 IST)
బ్రిటన్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చింది. టిట్‌ ఫర్‌ టాట్‌ అన్నట్లుగా వ్యవహరించింది. భారత్‌కు వచ్చే బ్రిటన్‌ పౌరులు టీకా వేయించుకున్నప్పటికీ విధిగా పది రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. సోమవారం నుంచి ఇది అమలులోకి వస్తుందని తెలిపింది. 
 
'అక్టోబర్ 4 నుండి భారతదేశానికి వచ్చే బ్రిటన్‌ జాతీయులంతా, వారి టీకా స్థితితో సంబంధం లేకుండా, మూడు కోవిడ్‌ 19 ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రయాణానికి 72 గంటల ముందు, విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు, భారత్‌కు వచ్చిన 8వ రోజు తర్వాత కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలి. అలాగే భారతదేశానికి చేరిన తర్వాత ఇంట్లో లేదా గమ్యస్థాన చిరునామాలో తప్పనిసరిగా 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి' అని ప్రకటించింది.
 
బ్రిటన్‌ ప్రభుత్వం కూడా ఇటీవల భారతీయ ప్రయాణికుల పట్ల ఇలాంటి ఆంక్షలు విధించింది. కోవిషీల్డ్‌ టీకా గుర్తింపు, వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌పై అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిపై భారత్‌ సీరియస్‌ అయ్యింది. దీంతో కోవిషీల్డ్‌ను అనుమతించిన వ్యాక్సిన్‌గా పరిగణిస్తున్నట్లు తెలిపింది. 
 
అయితే భారతీయ టీకా సర్టిఫికేట్‌ను గుర్తించబోమని చెప్పింది. కాగా, దీనిపై ప్రతి చర్యలు తీసుకుంటామని భారత్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత్‌కు వచ్చే బ్రిటన్ పౌరులు వారి టీకా స్థితితో సంబంధం లేకుండా విధిగా పది రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments