Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ చేస్తుంటే బ్లాక్ లిస్టులో పెట్టేసిన ప్రియుడు, ఇక ఎందుకీ జీవితం అనుకున్న ప్రేయసి

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (22:52 IST)
పండంటి కాపురం.. 13 యేళ్ళ కొడుకు. హాయిగా సాగిపోతున్న జీవితం. ఉన్నట్లుండి భర్తకు గుండెనొప్పి రావడంతో చనిపోయాడు. ఇంకేముంది ఆ కొడుకుతో ఆ వివాహిత నానా కష్టాలు పడింది. ఆస్తి ఉన్నా భర్త లేని లోటు ఆమెకు వెలితిగా అనిపించింది. అందుకే ఫేస్ బుక్‌లో అకౌంట్ ఓపెన్ చేసింది. ఆ అకౌంట్ చివరకు తన జీవితాన్ని నాశనం చేస్తుందని ఊహించలేదు వివాహిత.
 
తమిళనాడు కోయంబత్తూరు సిటీ. సెంథిల్ కుమార్, భువనేశ్వరికి 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. సెంథిల్ కుమార్ ఆర్థికంగా బాగా సంపాదించాడు. ఎలాంటి ఇబ్బందులు లేని కుటుంబం. 13 యేళ్ళ కుమారుడు కూడా వీరికి ఉన్నారు. అయితే సరిగ్గా రెండు నెలల క్రితం భర్త ఉన్నట్లుండి గుండెపోటుతో చనిపోయాడు.
 
దీంతో భువనేశ్వరి ఒంటిరిగా మారిపోయింది. కొడుక్కి లోకజ్ఞానం తెలియకపోవడంతో ఎలా నెట్టుకురావాలో తెలియలేదు. కావాల్సినంత డబ్బు ఉన్నా శారీరక సుఖం లేకపోవడం ఆమెను బాగా కుంగదీసింది. దీంతో ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసింది. కోయంబత్తూరులో ఉన్న స్నేహితులను వెతికింది.
 
అందులో ఒక యువకుడు ఖాజా అనే వ్యక్తికి బాగా కనెక్టయ్యింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్యా శారీరక సంబంధానికి దారితీసింది. ఖాజా ఖాళీగా తిరగుతూ ఉండేవాడు. దీంతో భువనేశ్వరి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి ఎంజాయ్ చేసేవాడు. కానీ ఖాజాకు భువనేశ్వరి బోర్ కొట్టేసింది. గత వారంరోజుల నుంచి ఎన్నిసార్లు ఫోన్లు తీసినా స్పందించలేదు. అంతేకాదు ఆమె నెంబర్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశాడు. దీంతో ఆవేదనకు గురైంది భువనేశ్వరి. ప్రియుడి లేని జీవితం వద్దనుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం భువనేశ్వరి కుమారుడు ఎవరూ లేని అనాధలా మారిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గలేదు.. యానిమల్ నటుడితో మహానటి?

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు 3,500 అడుగులు వేయాల్సిందే..

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments