Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి లక్షణాలుంటే 7 రోజుల్లోపు పరీక్షలు

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (17:55 IST)
కరోనా కేసులను పూర్తిగా నియంత్రించడమే లక్ష్యంగా భారత వైద్య పరిశోధన మండలి కీలక నిర్ణయం తీసుకుంది. జ్వరం, దగ్గు, గొంతులో ఇబ్బంది, జలుబు వంటి ఫ్లూ లక్షణాలు ఉన్నవారందరికీ ఏడు రోజుల్లోపు రియల్‌టైమ్ రివర్స్ ట్రాన్స్‌ క్రిప్షన్-పాలీమెరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్టీ-పీసీఆర్) పరీక్షలు నిర్వహించాలని ఐసీఎంఆర్ నిర్దేశించింది.

ఈ పరీక్షల్లో నెగటివ్ వస్తే ఏడు రోజుల తర్వాత యాంటీ బాడీ టెస్ట్‌లు చేయాలని పేర్కొంది. ఈ మేరకు కరోనా వ్యూహాన్ని సవరించిన ఐసీఎంఆర్.. వైరస్‌ సోకిన వారితో ప్రత్యక్ష సంబంధమున్న వారిని..ముప్పు ఎక్కువగా ఉన్నవారిగా పరిగణించాలని సూచించింది.

వారు సన్నిహితంగా మెలిగిన నాటి నుంచి 5-14 రోజుల మధ్యలో... ఒకసారి పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. హాట్‌స్పాట్లు, క్లస్టర్లు, ఎక్కువమంది వలస కూలీలు గుమికూడిన ప్రదేశాలు, ఖాళీ చేయించిన ప్రాంతాల్లో 5 నుంచి 14 రోజుల మధ్యలో పరీక్షలు నిర్వహించాలని సూచించింది.

తీవ్ర శ్వాసకోశ అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ పరీక్షలు చేయాలన్న ఐసీఎంఆర్.. విదేశాల నుంచి వచ్చి కరోనా లక్షణాలతో కనిపిస్తున్నవారు, పాజిటివ్‌గా తేలినవారితో సంబంధమున్న వారు, వైరస్‌ లక్షణాలు కనిపించే వైద్య ఆరోగ్య సిబ్బందికి పరీక్షలు చేయాలని నిర్దేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments