కరోనా నిర్ధారణ కోసం త్వరితగతిన టెస్టులు నిర్వహించేందుకు మరిన్ని కిట్లు తెప్పించాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నిర్ణయించింది. 7 లక్షల టెస్టింగ్ కిట్లను తెప్పించనున్నట్లు స్పష్టం చేసింది.
మరో రెండు రోజుల్లోనే అవి ఆయా కేంద్రాలకు అందనున్నట్లు పేర్కొంది. దేశంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. తాజాగా బాధితుల సంఖ్య 4000 వేలు దాటింది. అయితే.. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా పరీక్షలు నత్తనడకన సాగుతున్నాయి. రోజూ 10 వేలకు మించట్లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ శుభవార్త చెప్పింది. 7 లక్షల టెస్టింగ్ కిట్లకు ఆర్డరిచ్చామని.. ఏప్రిల్ 8కల్లా వస్తాయని స్పష్టం చేసింది.
దేశంలో కరోనా కేసులు ఎక్కువగా వెలుగుచూసిన హాట్స్పాట్లోనే వీటిని ఎక్కువగా వినియోగించనున్నారు. బుధవారం నాటికి ఐసీఎంఆర్‌కు సుమారు 7 లక్షల రాపిడ్ కరోనా యాంటీబాడీ పరీక్ష కిట్లు అందనున్నాయి.